Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సంచలనం:త్వ‌ర‌లో ప‌వ‌న్‌క‌ళ్యా‌ణ్ టీవీ షో...కసరత్తు మొదలైంది!

Recommended Video

    టీవీ షోతో ముందుకు రాబోతున్న పవన్

    విజయవాడ:పవన్ కళ్యాణ్ అభిమానులకు, జన సేన కార్యకర్తలకు ఇది నిజంగా శుభవార్తే...తమ అభిమాన కథానాయకుడు, రాజకీయ నేత పవన్ కళ్యాణ్ త్వరలో ఒక టెలివిజన్ షో చేయనున్నారట.

    అమీర్‌ఖాన్ 'స‌త్య‌మేవే జ‌య‌తే' త‌ర‌హాలో సామాజిక స‌మ‌స్య‌ల‌పై ప‌వ‌న్ క‌ళ్యా‌ణ్ ఈ టీవీ షో చేయ‌నున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఈ కార్య‌క్ర‌మ థీమ్‌, స్క్రిప్ట్ తతిదరాల కోసం పవన్ మీడియా టీం తీవ్రంగా క‌స‌ర‌త్తు చేస్తోందట. ఈ షోను కేవలం తెలుగుకే పరిమితం చేయకుండా హిందీ, ఇంగ్లీష్ భాష‌ల్లోనూ ప్ర‌సారం చేస్తారని సమాచారం.

    Sensation: Pawan Kalyan will host TV Show very soon...

    వారంలో రెండు సార్లు అరగంట చొప్పున ఈ షో టెలికాస్ట్ కానుంది. ఎక్కు‌వ మంది ప్ర‌జ‌ల‌కు త‌న‌ పార్టీ చేరువ‌య్యేందుకు ఈ కార్య‌క్ర‌మం దోహ‌ద‌ప‌డుతుంద‌ని ప‌వ‌న్ భావిస్తు‌న్నట్లు తెలిసింది. అయితే ఈ షో ఏ టీవీలో ప్రసారం అవుతుందనే విషయాన్ని ప్రస్తుతానికి సస్పెన్స్ గానే ఉంచారు. అయితే ఇటీవలే పవన్ అభిమాని, రాజకీయ నేత తోట చంద్రశేఖర్ ఒక ఛానల్ కొనుగోలు చేయడంతో బహుశా ఈ షో ఆ టివి ఛానెల్ కోసమేనని భావిస్తున్నారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+