"మాజీ మంత్రి జోగి రమేష్ చెప్పినట్లు చేశాం".. నకిలీ మద్యం కేసులో సంచలన వీడియో..
నకిలీ మద్యం కేసులో సంచలన వీడియో బయటకు వచ్చింది. నకిలీ మద్యం కేసులో ప్రధాన నిందితుడు జనార్ధన్ రావు సంచలన విషయాలు బయటపెట్టారు. వైసీపీ పాలనలో అప్పటి మంత్రి జోగి రమేష్ ఆధ్వర్యంలో నకిలీ మద్యం తయారీ చేసినట్టు జనార్ధన్ రావు తెలిపారు. టీడీపీ ప్రభుత్వం రాగానే నిఘా పెరగడంతో నకిలీ మద్యం వ్యాపారం ఆపేశామన్నారు.
"ఈ ఏడాది ఏప్రిల్ నెలలో జోగి రమేష్ నాకు కాల్ చేసి నకిలీ మద్యం తయారు చెయ్యాలని చెప్పారు. టీడీపీ ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించడానికి మళ్లీ నువ్వు నకిలీ మద్యం తయారీ మొదలుపెట్టాలని జోగి రమేష్ నాతో అన్నారు. ఇబ్రహీంపట్నంలో పెట్టాలి అనుకున్నా కానీ జోగి రమేష్ ఆదేశాలతో మొదట తంబళ్లపల్లె నియోజకవర్గంలో తయారీ మొదలుపెట్టాం. తంబళ్లపల్లె నియోజకవర్గం లో లిక్కర్ షాపులు నేను తీసుకున్నా. తంబళ్లపల్లె నుండి ప్రారంభిస్తే చంద్రబాబు ప్రభుత్వంపై బురద జల్లొచ్చు అది మనకి అడ్వాంటేజ్ అవుతుంది అని జోగి రమేష్ అన్నారు" అని నకిలీ మద్యం కేసులో ఏ1 నిందితుడు జనార్ధన్ రావు తెలిపాడు.
"వేరే వాళ్ల పేరు మీద రూమ్ అద్దెకు తీసుకొని లిక్కర్ తయారీకి కావలసిన యంత్రాలు అన్ని తీసుకొచ్చాం. లిక్కర్ తయారీ చెయ్యండి. మంచి సమయం చూసి మీరు ఎవరూ లేనప్పుడు దానిని ప్రభుత్వం మీద రుద్దుదామని జోగి రమేష్ నాతో అన్నారు. నీకు ఉన్న ఆర్ధిక ఇబ్బందులు నుండి బయటపడటానికి సహాయం చేస్తామని జోగి రమేష్ హామీ ఇచ్చారు. అంతా రెడీ అయిన తరువాత నన్ను ఆఫ్రికాలో ఉన్న నా ఫ్రెండ్ దగ్గరకు పంపారు. జోగి రమేష్ తన మనుషుల ద్వారా డిపార్ట్‌మెంట్ కు లీక్ ఇచ్చి రైడ్ చేయించాడు. తద్వారా ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలని కుట్ర చేశాడు" అని నిందితుడు జనార్ధన్ రావు తెలిపాడు.
నకిలీ మద్యం కేసులో జనార్దన్ సంచలన వీడియో
— oneindiatelugu (@oneindiatelugu) October 13, 2025
ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేస్తానని జోగి రమేష్ చెప్పారు
జోగి రమేష్ ఆధ్వర్యంలోనే నకిలీ మద్యం తయారీ ప్రభుత్వానికి చెడ్డ పేరు రావడానికే కుట్ర చేశారు
కూటమి ప్రభుత్వం రాగానే నిఘా పెరగడంతో నకిలీ మద్యం వ్యాపారం ఆపేశాం
ఈ ఏడాది… pic.twitter.com/fbV7wjCd1u
"చంద్రబాబు టీడీపీ వారిని సస్పెండ్ చేయడంతో జోగి రమేష్ మరో ప్లాన్ వేశారు. మన ప్లాన్ వర్కవుట్ అవ్వలేదు. ఇబ్రహీంపట్నంలో కూడా రైడ్ చేయిద్దాం సరుకు తీసుకొచ్చి పెట్టు అని జోగి రమేష్ అన్నారు. ఇబ్రహీంపట్నం గోడౌన్ లో ముందు రోజే అన్నీ తీసుకొచ్చి పెట్టమని జోగి రమేష్ అన్నారు. జోగి రమేష్ చెప్పినట్టే లీక్ ఇచ్చి రైడ్ చేయించాడు. సాక్షి మీడియాను కూడా ముందే అక్కడ ఉంచారు. అనుకున్నది అంతా జరిగింది చంద్రబాబు ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చింది అంతా బాగా జరిగింది నువ్వు రావాల్సిన అవసరం లేదు అని జోగి రమేష్ అన్నారు" అని జనార్ధన్ రావు వివరించాడు.

"అంతా నేను చూసుకుంటా బెయిల్ ఇప్పిస్తా అని హామీ ఇచ్చిన జోగి రమేష్ హ్యాండ్ ఇచ్చాడు. నా తమ్ముడ్ని కూడా ఇందులో జోగి రమేష్ ఇరికించాడు. నీ ఫ్రెండ్ జై చంద్రారెడ్డి ఎలాగో ఆఫ్రికా వ్యాపారాలు చేసుకుంటున్నాడు అతనికి వచ్చే ఎన్నికల్లో సీటు రాదు అని జోగి రమేష్ నన్ను నమ్మించాడు. జై చంద్రారెడ్డికి జరిగిన దానికి అసలు సంబంధం లేదు. జోగి రమేష్ తో నాకు చిన్నప్పటినుండి పరిచయం. నన్ను నమ్మించి జోగి రమేష్ మోసం చెయ్యడంతో బయటకు వచ్చి నిజం చెబుతున్నా" అని సంచలన విషయాలను జనార్ధన్ రావు బయటపెట్టాడు.
-
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!!












Click it and Unblock the Notifications