చంద్రబాబు అరెస్ట్ పై "సి ఓటర్ సర్వే" సంచలనం!!
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టయి రిమాండ్ ఖైదీగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న విషయం తెలిసిందే. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ తో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కక్ష సాధింపు చర్యలో భాగంగా చంద్రబాబు అరెస్ట్ జరిగిందని వారు ఆరోపిస్తున్నారు.
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. ఏపీలో తాజా పరిస్థితులపై సి ఓటర్ సర్వే నిర్వహించిన సర్వేలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సి ఓటర్ సర్వేను ఐఏఎన్ఎస్ న్యూస్ ఏజెన్సీ ట్వీట్ చేసింది.

చంద్రబాబు నాయుడును అరెస్టు చేసిన తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడుకి, టిడిపికి విపరీతమైన సానుభూతి వచ్చిందని సి ఓటర్ సర్వే వెల్లడించింది. చంద్రబాబు అరెస్టుతో జగన్ లో భద్రతాభావం పెరిగిపోయిందని సి ఓటర్ సర్వే తేల్చింది. వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి ప్రజల నుంచి సానుభూతి దొరుకుతుందని ఎక్కువ మంది అభిప్రాయపడినట్లుగా పేర్కొంది.
మొత్తం 1809 మంది నమూనా పరిమాణం ఈ సర్వేలో పాల్గొనగా మొత్తం చంద్రబాబు నాయుడుపై ఆయన అరెస్టు చేయడం వల్ల సానుభూతి పెరుగుతుందని 53 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఈ అరెస్టు వల్ల చంద్రబాబు నాయుడుకి ప్రజలలో సానుభూతి పెరుగుతుందని పేర్కొన్నారు.
36 శాతం మంది ఈ అరెస్టు జగన్ రెడ్డికి సహాయపడుతుందని అభిప్రాయపడ్డారు. ఈ అరెస్టుతో ఓటర్లలో చంద్రబాబు పట్ల సానుభూతి పెరుగుతుందని మెజారిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు. 53 శాతానికి పైగా ఆంధ్రప్రదేశ్ వాసులు చంద్రబాబు అరెస్టు వచ్చే ఎన్నికలలో తప్పనిసరిగా ప్రభావం చూపిస్తుందని పేర్కొన్నారు.
ఏది ఏమైనా చంద్రబాబు అరెస్టు పరిణామాలపై సి ఓటర్ సర్వేలో ఆసక్తికర ఫలితాలు వెల్లడి కావడంతో వైసీపీ శ్రేణులలో ఆందోళన వ్యక్తం అవుతుంది. చంద్రబాబు అరెస్టు టిడిపికి కలిసొస్తుందా? లేక నష్టం చేస్తుందా? అనేది మాత్రం ముందు ముందు తేలనుంది.
-
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!












Click it and Unblock the Notifications