Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పత్తికొండ రక్తచరిత్ర: 1978 నుండి 14 మంది హత్య, ఆధిపత్యపోరే కారణమా?

కర్నూల్ జిల్లాలోని పత్తికొండ అసెంబ్లీ నియోజకవర్గంలో ఆధిపత్యపోరులో అనేక హత్యలు చోటుచేసుకొన్నాయి. అధికార, విపక్షపార్టీలకు చెందిన నాయకులు, ప్రజాప్రతినిధులు హత్యలకు గురయ్యారు.

కర్నూల్: కర్నూల్ జిల్లాలోని పత్తికొండ అసెంబ్లీ నియోజకవర్గంలో ఆధిపత్యపోరులో అనేక హత్యలు చోటుచేసుకొన్నాయి. అధికార, విపక్షపార్టీలకు చెందిన నాయకులు, ప్రజాప్రతినిధులు హత్యలకు గురయ్యారు.

1970 దశకం నుండి హత్య రాజకీయాలు చోటుచేసుకొంటున్నాయి.ఈ హత్యలకు ప్రతీకారంగా ప్రత్యర్థులను హత్యలు చేయడం కొనసాగుతూనే ఉంది. పార్టీలు మారినా, ప్రత్యర్థుల పగలు , ప్రతీకారాలు మాత్రం తగ్గడం లేదు.

serial murders

1978 లో పత్తికొండలో రెండో సారి ఎమ్మెల్యే స్థానానికి నామినేషన్ వేసి తిరిగివెళ్తున్న ఎర్రగుడి ఈశ్వర్ రెడ్డిపై ప్రత్యర్థులు హత్యయత్నం చేశారు. ఈ సమయంలో ఆయన ప్రాణాలతో బయటపడ్డారు. 1979 ఆగష్టు4వ, తేదిన ఆదోనికి వెళ్తున్న సమయంలో తుగ్గలి మండలంలోని గవనికొండ వద్ద బస్సులో నుండి ఈశ్వర్ రెడ్డిని ప్రత్యర్థులు హత్యచేశారు.

1985 మార్చి 11న, టిడిపి ఎమ్మెల్యేగా విజయం సాధించిన మహబలేశ్వర గుప్తను 1985 ఏప్రిల్ 27న, పత్తికొండ పట్టణంలోని శ్రీ కన్యకాపరమేశ్వరి కళ్యాణమండపం వద్ద రాజకీయ ప్రత్యర్థులు బాంబులు పేల్చి వేటకొడవళ్ళతో దారుణంగా హత్య చేశారు.

ఎమ్మెల్యేగా రెండుసార్లు బరిలో నిలిచి ఓటమిపాలైన రామకృష్ణారెడ్డి 1985 జూన్ 11న, కర్నూల్ పట్టణంలో రాజకీయ ప్రత్యర్థుల చేతిలో దారుణంగా హత్యకు గురయ్యాడు. 1989 లో పత్తికొండ ఎమ్మెల్యేగా పాటిల్ శేషిరెడ్డి విజయం సాధించారు.

పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో ఉన్న శేషిరెడ్డిని 1996 ఏప్రిల్ 18న గోనెగండ్లలో ప్రత్యర్థులు వెంటాడి హత్య చేశారు. పెండేకల్లు గ్రామంలో 1990 ఏప్రిల్ 3న, కాంగ్రెస్ పార్టీకి చెందిన నల్లారెడ్డి నివాసగృహంపై ప్రత్యర్థులు కిరోసిన్ పోసి నిప్పు పెట్టడంతో భార్య,భర్తలు మరణించారు.

చక్రాళ్ళ గ్రామం నుండి 1998 డిసెంబర్ 28న, పత్తికొండకు బస్సులో వస్తున్న కాంగ్రెస్ పార్టీకి చెంెదిన నలుగురు కార్యకర్తలను ప్రత్యర్థులు హత్య చేశారు. కడమకుంట్ల గ్రామంలో 1998 లో సిపిఐ నాయకుడు కాంతరెడ్డి , విశ్వనాథ్ శర్మను రాజకీయ ప్రత్యర్థులు హత్యచేశారు. హత్య చేసిన ప్రత్యర్థిని2011 నవంబర్ 28న, కాంగ్రెస్ నాయకుడు అనిమిరెడ్డిని రైల్వే బ్రిడ్జి కింద హతమార్చారు.

2008 మే 17న, మాజీ జడ్ పి టిసి సభ్యుడు కప్పట్రాళ్ళ వెంకటప్పనాయుడు తన స్వగ్రామం నుండి కర్నూల్ కు వెళ్తున్న సమయంలో ప్రత్యర్థుల చేతిలో కప్పట్రాళ్ళ వెంకటప్పనాయుడుతో సహా పదిమంది హతమయ్యారు. తాజాగా వైసీపీ నాయకుడు నారాయణరెడ్డి హత్యకు గురయ్యారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+