అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబుకు షాక్: అమరావతికి రుణంపై ప్రపంచ బ్యాంక్ డైలమా? ఇదీ జరిగింది

రాజధాని అమరావతికి ప్రపంచ బ్యాంకు రుణం విషయంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ఓ షాక్! అమరావతిలో ప్రాజెక్టులకు ఫైనాన్స్ పైన పునరాలోచన చేస్తోందని ప్రచారం సాగుతోంది.

|
Google Oneindia TeluguNews

Recommended Video

World Bank shock to Chandrababu అమరావతికి రుణంపై ప్రపంచ బ్యాంక్ డైలమా? | Oneindia Telugu

అమరావతి: రాజధాని అమరావతికి ప్రపంచ బ్యాంకు రుణం విషయంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ఓ షాక్! అమరావతిలో ప్రాజెక్టులకు ఫైనాన్స్ పైన పునరాలోచన చేస్తోందని ప్రచారం సాగుతోంది.

పాదయాత్రనా, వాహనంలోనా?: జగన్‌కు కౌంటర్‌గా.. పవన్ కళ్యాణ్ పర్యటన ఖరారు!పాదయాత్రనా, వాహనంలోనా?: జగన్‌కు కౌంటర్‌గా.. పవన్ కళ్యాణ్ పర్యటన ఖరారు!

తమ నుంచి బలవంతంగా భూములు లాక్కున్నారని, రుణం ఇవ్వొద్దని కొందరు రైతులు మొరపెట్టుకున్నారు. వీటిపై ప్రపంచ బ్యాంకు తనిఖీల బృందం చేసిన సిఫార్సు చర్చనీయాంశంగా మారింది.

టిడిపిని నిలదీయట్లేదని బిజెపి పెద్దల అసహనం: బాబుతో తేల్చుకునే వారికే చీఫ్?టిడిపిని నిలదీయట్లేదని బిజెపి పెద్దల అసహనం: బాబుతో తేల్చుకునే వారికే చీఫ్?

స్వచ్చంధమని చెప్పలేం

స్వచ్చంధమని చెప్పలేం

ల్యాండ్ పూలింగ్ స్వచ్చంధమని చెప్పలేమని, సామాజిక, ఆర్థిక, పర్యావరణ, ఆహార భద్రత... ఇలా పలు అంశాలపై ప్రపంచ బ్యాంకు తనిఖీల బృందం క్రోడీకరించింది. ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయని, వాటిపై పునర్విచారణ చేయాలని సిపార్సు చేసింది. ఆ తర్వాతే రుణం మంజూరు చేయడంపై నిర్ణయం తీసుకోవాలని బ్యాంక్ బోర్డుడైరెక్టర్లకు విజ్ఞాపన చేసింది.

 ప్రపంచ బ్యాంకు రుణం ఫిర్యాదులపై లోతైన విచారణ

ప్రపంచ బ్యాంకు రుణం ఫిర్యాదులపై లోతైన విచారణ

అమరావతిలో మౌలిక వసతుల ప్రాజెక్టులకు ప్రపంచ బ్యాంకు రుణం మంజూరుకు సంబంధించి రాజధాని గ్రామాలకు చెందిన కొందరు చేసిన ఫిర్యాదులపై లోతైన విచారణ అవసరమని ప్రపంచ బ్యాంకు తనిఖీ బృందం సిఫార్సు చేసింది. ప్రపంచ బ్యాంకు నిధులతో చేపడుతున్న ప్రాజెక్టుల వల్ల తమకు హాని జరుగుతోందని, రుణం మంజూరు చేసే విషయంలో అనుసరించాల్సిన మార్గదర్శకాలను ప్రపంచ బ్యాంకు పక్కన పెట్టిందంటూ వచ్చిన ఫిర్యాదులను బృందం పరిశీలించిందని, నిబంధనల ప్రకారం వారు చేసిన ఫిర్యాదులు పరిగణనలోకి తీసుకోదగ్గవేనని పేర్కొంది.

 ఆ ఫిర్యాదులపై ఎక్కువ దృష్టి పెట్టాలి

ఆ ఫిర్యాదులపై ఎక్కువ దృష్టి పెట్టాలి

ముఖ్యంగా ప్రపంచ బ్యాంకు నిధులతో చేపట్టే ప్రాజెక్టుల వల్ల నిర్వాసితులవుతున్నవారి సమస్యలు, వాటి వల్ల పర్యావరణానికి హాని కలుగుతోందంటూ వస్తున్న ఆందోళనలు, ఈ ప్రాజెక్టులకు సంబంధించి తమ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోలేదని, తగిన సమాచారం ఇవ్వలేదని ఫిర్యాదుదారులు పేర్కొనడంపై ఎక్కువ దృష్టి పెట్టాలని తనిఖీ బృందం సూచించింది.

 అంతరాలు ఉన్నాయి

అంతరాలు ఉన్నాయి

తనిఖీ బృందం నివేదికలోని అంశాలను ఫిర్యాదుదారులు మీడియాకు తెలిపారు. ఫిర్యాదుదారులు తమ ఫిర్యాదులో పేర్కొన్న అంశాలకు, దానిపై ప్రపంచ బ్యాంకు యాజమాన్యం ఇచ్చిన వివరణకు మధ్య అంతరాలున్నాయని తనిఖీ బృందం అభిప్రాయపడినట్టు తెలిపారు.

అసలు ఏం జరిగిందంటే?

అసలు ఏం జరిగిందంటే?

అమరావతిలో వివిధ ప్రాజెక్టుల కోసం ప్రపంచ బ్యాంకు రూ.3500 కోట్ల రుణం ఇచ్చేందుకు సూత్రప్రాయంగా అంగీకరించింది. దీనికి సంబంధించిన ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో అమరావతికి చెందిన కొందరు ప్రపంచ బ్యాంకు తనిఖీ బృందానికి ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం తమను బెదిరించి భూసమీకరణలో భూములు తీసుకుంటోందని, పునరావాస నిబంధనలను పాటించడం లేదని, ఆహార భద్రతకు ముప్పు వాటిల్లుతుందని, పర్యావరణ సమస్యలు తలెత్తుతాయని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుల వల్ల సామాజికంగా, పర్యావరణపరంగా చోటు చేసుకునే పరిణామాలపై అభిప్రాయ సేకరణ సక్రమంగా చేపట్టలేదని వివరించారు. 2017 జూన్‌ 12న తనిఖీ బృందం ఈ ఫిర్యాదును నమోదు చేసుకుంది.

 ప్రతిగా ప్రపంచ బ్యాంకుకు విజ్ఞప్తి

ప్రతిగా ప్రపంచ బ్యాంకుకు విజ్ఞప్తి

అదే సమయంలో రాజధానికి అనుకూలంగా ఉన్న, భూసమీకరణలో భూములిచ్చిన రైతుల్లో 1549 మంది తమ సంతకాలతో ప్రపంచ బ్యాంకుకు విన్నపాన్ని పంపించారు. భూసమీకరణ వంటి ప్రక్రియలన్నీ నిబంధనల ప్రకారమే జరుగుతున్నాయని, ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తోందని వారు పేర్కొన్నారు. ఫిర్యాదులపై తనిఖీ బృందం ప్రపంచ బ్యాంకు యాజమాన్యం స్పందన కోరింది.

 ఇరువర్గాలతో మాట్లాడిన ప్రపంచ బ్యాంక్ బృందం

ఇరువర్గాలతో మాట్లాడిన ప్రపంచ బ్యాంక్ బృందం

అనంతరం తనిఖీ బృందం సెప్టెంబరు 12 నుంచి 15 వరకు రాజధానిలో పర్యటించింది. రాజధానికి అనుకూలంగా ఉన్న రైతులతోను, ఫిర్యాదు చేసినవారితోను మాట్లాడింది. ప్రపంచ బ్యాంకు, సీఆర్డీఏ అధికారుల నుంచి సమాచారం స్వీకరించింది. వాటన్నిటినీ పరిశీలించాక సెప్టెంబరు 27న తన నివేదిక అందజేసింది. ఫిర్యాదుదారుల ఆందోళనల్లోని నిజానిజాలు నిగ్గు తేలాలంటే లోతైన విచారణ అవసరమని తనిఖీ బృందం సూచించినట్లుగా చెబుతున్నారు.

English summary
In a major setback for the Andhra Pradesh government, the World Bank is still considering financing the Amaravati project. The World Bank, which was supposed to provide loans to develop the capital city Amaravati, is initiating a probe into the resettlement of farmers instead.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X