Nandigam Suresh: నందిగం సురేశ్ కు మరో షాక్-కోర్టు ఆదేశాలతో మూడు రోజులు..!
ఏపీలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి చేసిన కేసులో మాజీ ఎంపీ నందిగం సురేశ్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే ఈ కేసులో అరెస్టు తర్వాత గుంటూరు జైల్లో ఉంటున్న సురేశ్ కు మంగళగిరి కోర్టు ఇవాళ మరో షాకిచ్చింది. పోలీసుల వినతి మేరకు ఆయన్ను మూడు రోజుల పాటు కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆయన్ను కస్టడీలో విచారించేందుకు పోలీసులు సిద్దమవుతున్నారు.
వైసీపీ మాజీ ఎంపీ అయిన నందిగం సురేశ్ ను టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ఈ నెల 15 నుంచి 17 వరకూ పోలీసు కస్టడీలో విచారించేందుకు మంగళగిరి కోర్టు ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఆయన్ను ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ విచారించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం గుంటూరు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న సురేశ్ ను ఎల్లుండి పోలీసులు అదుపులోకి తీసుకోనున్నారు. ఆయన్ను మంగళగిరి రూరల్ పీఎస్ లో విచారించబోతున్నారు.

ఈ నెల 5న అరెస్టు తర్వాత పోలీసులకు విచారణలో నందిగం సురేశ్ సహకరించడం లేదు. దీంతో ఆయన్ను కస్టడీలోకి తీసుకుని విచారించేందుకు పోలీసులు కోర్టు అనుమతి కోరారు. ఇప్పుడు మంగళగిరి కోర్టు అనుమతి ఇవ్వడంతో మూడు రోజుల పాటు టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో విచారించనున్నారు. అప్పట్లో దాడికి సురేశ్ ను పంపింది ఎవరు, ఈ మొత్తం ఆపరేషన్ నడిపించింది ఎవరు, ఎవరెవరు పాల్గొన్నారనే అంశాలపై సురేశ్ నుంచి వివరాలు తీసుకునే అవకాశముంది. ఇదే కేసులో ఇవాళ సుప్రీంకోర్టు మరో ఇద్దరు వైసీపీ నేతలు దేవినేని అవినాష్, జోగి రమేశ్ అరెస్టు కాకుండా తాత్కాలిక ఊరటనిచ్చింది.












Click it and Unblock the Notifications