Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మార్గదర్శికి సుప్రీంకోర్టు షాక్-పాత తీర్పు రద్దు-తెలంగాణ హైకోర్టుకు డెడ్ లైన్..!

మార్గదర్శి చిట్స్ అక్రమాల వ్యవహారంలో ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకుంది. గతంలో మార్గదర్శి కేసులో విచారణను రద్దు చేస్తూ ఏపీ-తెలంగాణ ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన తీర్పును ఇవాళ కొట్టేసింది. అంతే కాదు ప్రస్తుతం ఇరు తెలుగు రాష్ట్రాలతో ముడిపడిన ఈ కేసు విచారణను తెలంగాణ హైకోర్టుకు రిఫర్ చేసింది. ఆరు నెలల్లో ఈ విచారణ పూర్తి చేయాలని డెడ్ లైన్ కూడా పెట్టింది. దీంతో మార్గదర్శి వ్యవహారంలో ఇక వేగంగా విచారణ సాగనుంది.

మార్గదర్శి అక్రమాలపై నమోదైన కేసును ఇవాళ విచారించిన జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విశ్వనాథ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు బెంచ్.. డిపాజిట్లపై సమగ్ర పరిశీలన జరగాలని అభిప్రాయపడింది. డిపాజిటర్లకు ఇంకా ఎవరికైనా డబ్బులు చెల్లించలేదా అన్నది తేల్చేందుకు మాజీ జడ్డిని నియమించాలని తెలంగాణ హైకోర్టును ఆదేశించింది. ఆరు నెలల్లోగా ఈ కేసుల విచారణ పూర్తి చేయాలని ఆదేశించింది.

setback to margadarsi chits in supreme court referred cases to ts high court

మార్గదర్శి కేసుల విచారణపై స్పందిస్తూ తాము కేసు మెరిట్స్ లోకి వెళ్లబోమని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. ఆర్బీఐతో పాటు తెలంగాణ హైకోర్టు రెండు, మూడు నెలల్లో డిపాజిట్లపై పరిశీలన జరపాలని సూచించింది. అనంతరం మార్గదర్శలో అక్రమాలపై విచారణ జరిపి ఆరునెలల్లో తీర్పు ప్రకటించాలని సుప్రీంకోర్టు తెలిపింది. అయితే ఇంతకు మించి ఈ కేసులో ఎలాంటి వ్యాఖ్యలు చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+