Pithapuram: ముద్రగడకు భారీ షాక్- పవన్ కు మద్దతు ప్రకటించిన కుమార్తె !
ఏపీలో ఎన్నికల వేళ రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. గత ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్లా ఓటమిపాలైన జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈసారి పిఠాపురం సీటును ఎంచుకోగానే ఆయన్ను టార్గెట్ చేసేందుకు వైసీపీ ఓ రేంజ్ లో వ్యూహాత్మకంగా పావులు కదిపింది. ఇందులో భాగంగా కాపు నేత ముద్రగడ పద్మనాభాన్ని పార్టీలో చేర్చుకుంది. ఆయనతో నిత్యం పవన్ ను టార్గెట్ చేయిస్తోంది. ఇలాంటి సమయంలో ముద్రగడకు భారీ షాక్ తగిలింది.
వచ్చే ఎన్నికల్లో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడిపోతున్నారని, అలా జరగకపోతే తన పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని వైసీపీ కాపు నేత ముద్రగడ పద్మనాభం తాజాగా సవాల్ విసిరారు. ఇది జరిగిన రెండు రోజుల్లోనే ఆయన కుటుంబం ఆయనతో విభేదిస్తూ పవన్ కళ్యాణ్ కు మద్దతు ప్రకటించింది. మద్రగడ కుమార్తె బార్లపూడి క్రాంతి తాజాగా ఓ వీడియో విడుదల చేశారు. ఇందులో ఆమె తన తండ్రిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

పవన్ కళ్యాణ్ కు మద్దతు ప్రకటించిన ముద్రగడ కుమార్తె క్రాంతి..!!#PawanKalyan #Janasena #MudragadaPadmanabham #Kranthi #ApElections2024 #Oneindiatelugu pic.twitter.com/XTyCojShFf
— oneindiatelugu (@oneindiatelugu) May 3, 2024
కేవలం పవన్ కళ్యాణ్ ను తిట్టడానికే ముద్రగడని జగన్ వాడుతున్నాడని ఆయన కుమార్తె క్రాంతి ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి వ్యతిరేకంగా పిఠాపురం లో పవన్ కళ్యాణ్ గెలుపు కోసం తన వంతు కృషి చేస్తానని క్రాంతి ప్రకటించారు. పిఠాపురంలో పవన్ ను ఓడించేందుకు వైసీపీ నేతలు ఎన్ని చేయాలో అన్నీ చేస్తానన్నారు. ముద్రగడ పవన్ పై విసిరిన సవాల్ వెనుక కాన్సెప్ట్ ఏంటో అర్దం కావడం లేదన్నారు.
వంగా గీతను గెలిపించడానికి ముద్రగడ పద్మనాభం కష్టపడొచ్చని, కానీ పవన్ ను, ఆయన అభిమానుల్ని కించపరిచేలా కామెంట్స్ ఉండకూడదని క్రాంతి తెలిపారు. ఈ ఎన్నికల తర్వాత ముద్రగడను ఎటూ కాకుండా వైసీపీ వదిలేయడం పక్కా అని క్రాంతి జోస్యం చెప్పారు. కాబట్టి ఈ విషయంలో తన తండ్రి ముద్రగడను పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications