ఒకే ఫ్యామిలీనుండి పోటీ చేసిన 7గురు అభ్యర్థుల ఓటమి
హైదరాబాద్: ఒకే కుటుంబం నుంచి పోటీ చేసిన ఏడుగురు అభ్యర్థులు ఓడిపోయారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నగర పంచాయతీకి సంబంధించి పలు వార్డుల నుంచి వీరు పోటీ చేసి ఓడిపోయారు. వీరిలో ఐదుగురు కాంగ్రెస్ అభ్యర్థులు. ఇబ్రహీంపట్నంలోని ఓ స్కూల్ యజమాని కుటుంబానికి చెందిన ఏడుగురు సభ్యులు పలు వార్డుల్లో కౌన్సిలర్లుగా పోటీ చేశారు.
ఇబ్రహీంపట్నం ఒకటో వార్డు నుంచి స్కూల్ యజమాని తనయుడు భానుబాబు, 4, 13 వార్డుల నుంచి కూతుళ్లు భానురేఖ, భానుప్రియ, 15వ వార్డు నుంచి భార్య ఆండాళ్, 20వ వార్డు నుంచి అల్లుడు పల్లె శ్రీధర్ బాబు, 9 వార్డు నుంచి కోడలు జయ, 16వ వార్డు నుంచి కుమారుడు భానుచందర్ పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

మాజీ మంత్రి గ్రామంలో స్వతంత్ర అభ్యర్థి
ప్రకాశం జిల్లాలో మాజీ మంత్రి స్వగ్రామంలో స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. మాజీ మంత్రి మహీధర్ రెడ్డి స్వగ్రామం అయిన మాచవరంలో స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు.












Click it and Unblock the Notifications