కొత్తగా పెళ్లయిన యువతిపై ఏడుగురు గ్యాంగ్ రేప్
హైదరాబాద్: గుజరాత్‌లో ఓ యువతిపై అత్యంత దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఏడుగురు కామాంధులు కొత్తగా పెళ్లయిన 18 ఏళ్ల యువతిపై నీచంగా విరుచుకుపడి, సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. గుజరాత్ రాష్ట్రంలోని షినోర్ తాలూకా భీతాలీ గ్రామంలో శనివారం రాత్రి ఈ సంఘటన చోటు చేసుకుది.
యువతి, ఆమె కుటుంబ సభ్యులు నివసిస్తున్న ఇంట్లోకి దుండగులు చొరబడి, ఆమెను పొలాల్లోకి లాక్కెళ్లి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. పనికోసం ఆమె తన భర్త, తన అత్తావారింటితో ఇటీవలో భీతాలికి వచ్చింది. ఆ కుటుంబానికి గ్రామానికి చెందిన భూయజమాని కూలీలుగా పని ఇచ్చాడు. నిందితులు యువతిని పొలాల్లోని నిర్మానుష్యమైన ప్రదేశానికి ఎత్తుకెళ్లారు.

తన భార్యను ఎత్తుకుపోయిన వెంటనే ఆమె భర్త పొలాల యజమాని వద్దకు పరుగెత్తాడు. అతను వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. నిందితులు తమ ముఖాలకు ముసుగు కప్పుకుని, చంపేస్తామని బెదిరించి యువతిని ఎత్తుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపాీరు.
బాధితురాలి కుటుంబ సభ్యులు ఛటో ఉదేపూర్‌లోని నాస్వాడి తాలూకా నిషానా గ్రామానికి చెందినవారు. ఈ సంఘటన కుటుంబ సభ్యులు దిగ్భ్రాంతికి గురయ్యారు. యువతికి ఎస్ఎస్‌జి ఆస్పత్రిలో వైద్య చికిత్స జరుగుతోంది. ఏడుగురు నిందితులు కూడా 25, 30 ఏళ్ల మధ్య వయస్సు గలవారు.
గత ఐదు రోజుల్లో మధ్య గుజరాత్‌లో ఇటువంటి సంఘటనల్లో ఇది రెండోది. ఈ నెల 14వ తేదీన నలుగురు వ్యక్తులు మహిసాగర్ జిల్లాలోని ఓ గ్రామంలో ఓ బాలికపై అత్యాచారం చేసి ఆమెను చంపేశారు. ఆమెను గొంతు నులిమి చంపేసి చెట్టుకు వేలాడదీశారు.












Click it and Unblock the Notifications