విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ట్రిపుల్ మర్డర్ కేసు: ఢిల్లీలో నిందితుల అరెస్ట్(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

కృష్ణా: జిల్లాలో సంచలనం సృష్టించిన ట్రిపుల్ మర్డర్ కేసు దర్యాప్తులో పురోగతి సాధించారు. పోలీసు దర్యాప్తు బృందాలు దేశ రాజధాని ఢిల్లీలో హత్యలకు పాల్పడిన ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నాయి. హత్యలకు కుట్ర పన్నిన వారితో సహా కిరాయి హంతకులను అరెస్టు చేసినట్లు అక్కడి జాయింట్ కమిషనర్ యాదవ్ వెల్లడించారు. విజయవాడ పోలీసు కమిషనర్ ఏబి వెంకటేశ్వరరావు, డిసిపి తస్వీర్ ఇక్బాల్ నేతృత్వంలో ప్రత్యేక బృందం ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్లి ఢిల్లీ పోలీసుల సాయంతో నిందితులను పట్టుకోగలిగారు.

పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి మండలం పినకడిమి గ్రామానికి చెందిన గంధం మారయ్య, గంధం పగిడి వీరయ్యతోపాటు వీరి తండ్రి గంధం నాగేశ్వరరావు సెప్టెంబర్ 24న పెదఅవుటపల్లి వద్ద జాతీయ రహదారిపై జరిగిన దుండగుల కాల్పుల్లో మరణించిన విషయం తెలిసిందే. గ్రామంలో రెండు వర్గాల మధ్య నెలకొన్న విభేదాల నేపథ్యం ఈ ముగ్గురి హత్యకు దారి తీసింది. ప్రత్యర్థి వర్గానికి చెందిన నాగరాజు హత్య కేసులో నిందితులైన మారయ్య, వీరయ్య, నాగేశ్వరరావు ఏలూరు కోర్టులో వాయిదాలకు హాజరవుతున్నారు.

ఇదే క్రమంలో పెదఅవుటపల్లి వద్దకు రాగానే దుండగులు మరో కారుతో వెంబడించి ఢీకొట్టి తుపాకీతో కాల్పులు జరిపి ముగ్గురినీ హత్య చేసి పరారయ్యారు. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీస్ కమిషనర్ వెంకటేశ్వరరావు, డిసిపి తస్ఫీర్ ఇక్బాల్ నేతృత్వంలో ఈస్ట్ ఎసిపి ఉమామహేశ్వరరాజుతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ బృందం కొద్ది రోజుల క్రితం పినకడిమి గ్రామాన్ని జల్లెడ పట్టి అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించడం ద్వారా ఢిల్లీ సమాచారం వెల్లడైంది.

ఢిల్లీ కళ్యాణపురి ప్రాంతానికి చెందిన ముగ్గురు కుట్రదారులు, నలుగురు కాంట్రాక్టు కిల్లర్స్‌ను అరెస్టు చేసి ఆరు తుపాకులు, ఒక వ్యాను, ఒక బైక్ స్వాధీనం చేసుకున్నట్లు ఢిల్లీ జాయింట్ పోలీసు కమిషనర్ తెలిపారు. నిందితులకు లండన్ నుంచి కోటి రూపాయలు సుపారీ అందిందని, హత్యలో ఎనిమిది నుంచి 10 మంది వరకు పాల్గొన్నారని, మరో షూటర్, మరికొందరు పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. ఈ హత్యలకు భూతం గోవిందు, శ్రీనివాసరావులే కారకులుగా తెలుస్తోంది. నిందితులను కార్జాడుమా కోర్టులో హాజరపర్చగా న్యాయమూర్తి రిమాండు విధించారు. వీరిని రెండుమూడు రోజుల్లో విజయవాడకు తీసుకువచ్చే అవకాశాలున్నాయి.

నిందితుల అరెస్ట్

నిందితుల అరెస్ట్

జిల్లాలో సంచలనం సృష్టించిన ట్రిపుల్ మర్డర్ కేసు దర్యాప్తులో పురోగతి సాధించారు. పోలీసు దర్యాప్తు బృందాలు దేశ రాజధాని ఢిల్లీలో హత్యలకు పాల్పడిన ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నాయి.

నిందితుల అరెస్ట్

నిందితుల అరెస్ట్

హత్యలకు కుట్ర పన్నిన వారితో సహా కిరాయి హంతకులను అరెస్టు చేసినట్లు అక్కడి జాయింట్ కమిషనర్ యాదవ్ వెల్లడించారు.

నిందితుల అరెస్ట్

నిందితుల అరెస్ట్

విజయవాడ పోలీసు కమిషనర్ ఏబి వెంకటేశ్వరరావు, డిసిపి తస్వీర్ ఇక్బాల్ నేతృత్వంలో ప్రత్యేక బృందం ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్లి ఢిల్లీ పోలీసుల సాయంతో నిందితులను పట్టుకోగలిగారు.

నిందితుల అరెస్ట్

నిందితుల అరెస్ట్

పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి మండలం పినకడిమి గ్రామానికి చెందిన గంధం మారయ్య, గంధం పగిడి వీరయ్యతోపాటు వీరి తండ్రి గంధం నాగేశ్వరరావు సెప్టెంబర్ 24న పెదఅవుటపల్లి వద్ద జాతీయ రహదారిపై జరిగిన దుండగుల కాల్పుల్లో మరణించిన విషయం తెలిసిందే.

English summary
In a joint operation, the Andhra Pradesh and the New Delhi Police arrested seven persons involved in the triple murder at Pedavutapalli village under the Unguturu police station limits in Krishna district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X