Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

చిక్కుల్లో వైసీపీ 4 ఎంపీలు-18 ఎమ్మెల్యేలు : రుజువైతే అనర్హతే : ఏడీఆర్ రిపోర్ట్..!!

ఏపీలో అనూహ్య మెజార్టీతో అధికారంలోకి వచ్చిన వైసీపీ నేతల్లో కొందరిని ఇప్పుడు ఒక ప్రధాన సమస్య వెంటాడుతోంది. క్రిమినల్‌ కేసులు ఎదుర్కొంటున్న ప్రజాప్రతినిధుల్లో కోర్టుల్లో అభియోగాలు దాఖలైన ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆంధ్రప్రదేశ్‌లో 24 మంది ఉన్నారు. 2019 నుంచి 2021 వరకు జరిగిన ఎన్నికల్లో గెలిచిన 2,495 మంది ప్రజాప్రతినిధుల అఫిడవిట్లను ప్రజాస్వామిక సంస్కరణల సంఘం (ఏడీఆర్‌) అధ్యయనం చేసి.. నివేదిక విడుదల చేసింది.

నేరం రుజువైతే అనర్హత వేటు..

నేరం రుజువైతే అనర్హత వేటు..

ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్‌ 8(1),(2),(3)లో పేర్కొన్న నేరాల కిందకు వచ్చే కేసుల్లో కోర్టులు అభియోగాలు నమోదు చేసిన వారి వివరాలను అందులో వెల్లడించింది. ఈ సెక్షన్ల ప్రకారం నేరం రుజువై శిక్షలు పడితే వారిపై అనర్హత వేటు పడుతుంది. ఏడీఆర్ వెల్లడించిన నివేదికలో 67 మంది ఎంపీలు, 296 మంది ఎమ్మెల్యేల (మొత్తం 363 మంది)పై అభియోగాలు నమోదైనట్లు తేల్చింది. అందులో ప్రధానంగా బీజేపీకి చెందిన వారు 83 మంది ఉండగా.. కాంగ్రెస్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వారిలో 47 మంది ఉన్నట్లు నిర్ధారించింది. ఇక, టీఎంసీ నుంచి 25 మంది ఉన్నట్లుగా లెక్కలు బయట పెట్టింది.

కేంద్ర మంత్రుల్లో నలుగురు..వైసీపీ నుంచి వీరి పేర్లు..

కేంద్ర మంత్రుల్లో నలుగురు..వైసీపీ నుంచి వీరి పేర్లు..

ఇక, కేంద్రంలో తాజాగా మంత్రివర్గ విస్తరణ తరువాత ప్రస్తుతం ఉన్న కేబినెట్ లోని 4 గురి పైన నేరాభియోగాలు ఉన్నట్లుగా వెల్లడించింది. 35 మంది పలు రాష్ట్రాల్లో మంత్రులుగా కొనసాగుతన్న వారి పైన కేసులు పెండింగ్ లో ఉన్నట్లు పేర్కొంది. ఇక, ఈ లిస్టులో వైసీపీ నుంచి నలుగురు ఎంపీలు- 18 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వైసీపీ లోక్ సభ ఫ్లోర్ లీడర్ పీవీ మిథున్‌రెడ్డి (రాజంపేట), అదే పార్టీ ఎంపీలు మార్గాని భరత్‌ (రాజమండ్రి), బెల్లాన చంద్రశేఖర్‌ (విజయనగరం), ఎంవీవీ సత్యనారాయణ (విశాఖ) ఉండగా.. రాష్ట్ర మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి, పి.రవీంద్రనాథ్‌రెడ్డి సహా 18 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.

టీడీపీ నుంచి గెలిచిన వారిలో ఆ ఇద్దరూ..తెలంగాణ ఎంపీలు..

టీడీపీ నుంచి గెలిచిన వారిలో ఆ ఇద్దరూ..తెలంగాణ ఎంపీలు..

టీడీపీ నుంచి గెలిచి ప్రస్తుతం వైసీసీకి అనధికారింగా మద్దతు తెలుపుతున్న ఎమ్మెల్యేలు కరణం బలరాం, వాసుపల్లి గణేష్ పేర్లు సైతం ఈ జాబితాలో ఉన్నాయి. ఇక, తెలంగాణలోని అధికార టీఆర్ఎస్ తో పాటుగా కాంగ్రెస్..బీజేపీ ఎంపీల పైన సైతం కేసులు పెండింగ్ లో ఉన్నట్లుగా నిర్ధారించారు. వారిలో సోయం బాపూరావు (బీజేపీ), కోమటిరెడ్డి వెంకటరెడ్డి (కాంగ్రెస్‌), మాలోతే కవిత (టీఆర్‌ఎస్) పేర్లను వెల్లడించారు. అయితే, ఏపీకి చెందిన పలువురు వైసీపీ ఎంపీలు.. ఎమ్మెల్యేల పైన నమోదైన కేసులు టీడీపీ ప్రభుత్వ హయాంలో నమోదు చేసినవిగా చెబుతున్నారు.

కొన్ని విత్ డ్రా..మరి కొన్ని విచారణలో..

కొన్ని విత్ డ్రా..మరి కొన్ని విచారణలో..

వీటికి సంబంధించి కేసుల వివరాలను ఎన్నికల అఫిడవిట్లలో పొందు పర్చారు. ఇందులో కొన్నింటిని ప్రస్తుత ప్రభుత్వం ఉప సంహరించుకున్నవి కూడా ఉన్నాయని వైసీపీ నేతలు చెబుతున్నారు. అయితే, తాజాగా సుప్రీం కోర్టు ప్రజా ప్రతినిధుల పైన కేసులు విత్ డ్రా చేయాలంటే...సంబంధిత హై కోర్టు అనుమతి తీసుకోవాలని నిర్దేశించింది. వీరి పైన కొన్ని కేసులు విత్ డ్రా కాగా.. మరి కొన్ని విచారణ దశలో ఉన్నాయని పార్టీ నేతల సమాచారం. అయితే, ఎన్నికల సంఘం వీరి పైన నమోదైన సెక్షన్ల కింద నేరం రుజువైతే మాత్రం రాజకీయంగా చిక్కులు తప్పవని చెబుతున్నారు.

Recommended Video

    NTR ని TDP నుండి సస్పెండ్ చేసి.. ఇప్పుడు నాటకాలా.. Vijaysaireddy మాస్ ట్రోలింగ్ || Oneindia Telugu
    వచ్చే ఎన్నికల్లోగా క్లియర్ అవుతాయా..

    వచ్చే ఎన్నికల్లోగా క్లియర్ అవుతాయా..

    దీంతో.. ఇప్పుడు ఈ జాబితాలో పేర్లు ఉన్న ప్రజాప్రతినిధులు తమ రాజకీయ భవిష్యత్ కోసం ఈ కేసుల నుంచి బయట పడేందుకు ప్రయత్నాలు ఇప్పటికే మొదలు పెట్టారు. ఈ జాబితాల్లోని పేర్ల పైన సంబంధిత నేతలు - పార్టీలు ఏ రకంగా రియాక్ట్ అవుతాయో వేచి చూడాల్సిందే. అయితే, వచ్చే ఎన్నికల్లోగా వీటిని క్లియర్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+