చిన్నారిని హత్య చేసిన సవతి తల్లి..! దీప్తిశ్రీ కేసులో విషాదం : రంగంలోకి ధర్మాడి సత్యం టీం..!
కాకినాడలో కిడ్నాప్ అయినట్లుగా భావిస్తున్న ఏడేళ్ల చిన్నారి దీప్తిశ్రీ కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. రెండు రోజులుగా గాలిస్తున్నా దీప్తి శ్రీ ఆచూకి లభించలేదు. సవతి తల్లి శాంతికుమారి మీద కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేయటంతో.. పోలీసులు విచారణ ప్రారంభించారు. అయితే, తాను దీప్తి శ్రీని హత్య చేసానని సవతి తల్లి అంగీకరించినట్లుగా తెలుస్తోంది. కానీ...శాంతి కుమారి ఇస్తున్న సమాధానాల్లో పొంతన లేదని పోలీసులు చెబుతున్నారు. చిన్నారిని తానే చంపి గోనేసంచిలో కట్టి ఉప్పుటేరులో పడేసినట్లు శాంతికుమారి పోలీసులకు చెప్పినట్టు తెలుస్తోంది. ఆమె ఇచ్చిన సమాచారం మేరకు ధర్మాడి సత్యం బృందం కూడా రంగంలోకి దిగి ఉప్పుటేరులో గాలింపు చర్యలు చేపడుతోంది.

ఆచూకీ దొరకని దీప్తి శ్రీ..
కాకినాడలో దీప్తిశ్రీ అనే ఏడేళ్ల చిన్నారి అదృశ్యం కలకలం సృష్టిస్తోంది. శుక్రవారం మధ్యాహ్నం నుంచి దీప్తిశ్రీ కనిపించకుండా పోయినా.. ఆమె మేనత్త పోలీసులకు ఆలస్యంగా ఫిర్యాదు చేసింది. కాకినాడ జగన్నాథపురంలో మేనత్త ఇంట్లో నివాసం ఉండే దీప్తిశ్రీ నేతాజీ స్కూల్లో చదువుతోంది. చిన్నారి కిడ్నాప్ కేసులో పోలీసుల విచారణ తీరు కూడా అనుమానాలకు తావిస్తోంది. తెలియరాలేదు. సవతి తల్లి శాంతికుమారినే దీప్తిశ్రీని హత్యచేసి ఉంటుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో సవతి తల్లిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పోలీసుల విచారణలో శాంతికుమారి నేరం అంగీకరించినట్లు తెలుస్తోంది. దీప్తిశ్రీని గొంతు నులిమి హత్య చేసినట్లు ఆమె విచారణలో వెల్లడించినట్టు సమాచారం. దీంతో ఆమె చెప్పిన ప్రదేశాల్లో పోలీసులు గాలిస్తున్నారు. చిన్నారిని తానే చంపి గోనేసంచిలో కట్టి ఉప్పుటేరులో పడేసినట్లు శాంతికుమారి పోలీసులకు చెప్పినట్టు తెలుస్తోంది.

సవతి తల్లి మీదే అనుమానాలు..చంపేసిందా..
దీప్తి శ్రీ తండ్రి శ్యామ్ సుందర్ మొదటి భార్య చనిపోయిన తర్వాత శాంతి కుమారిని రెండో పెళ్లి చేసుకున్నాడని, అప్పటి నుంచి సవతి తల్లి చేతిలో దీప్తిశ్రీ చిత్రహింసలు ఎదుర్కుంటోందని బంధువులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే కొన్నేళ్లుగా మనవరాలిని తామే చూసుకుంటున్నామని చెప్పుకొచ్చారు. ఓ జంట స్కూటర్‌పై వచ్చి దీప్తిశ్రీని తీసుకువెళ్లినట్లు స్కూల్ ఎదురుగా ఉన్న వృద్ధాశ్రమంలో కొందరు తెలిపారని బంధువు సూరాడ బేబి చెప్పారు. అలా తీసుకువెళ్లినవారు తన మనవరాలికి అపకారం తలపెట్టి ఉండవచ్చునని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. కాగా దీప్తిశ్రీ సవతి తల్లి శాంతి కుమారిని పోలీసులు అదుపులోకి తీసుకుని గట్టిగా ప్రశ్నించడంతో.. దీప్తిశ్రీని తాను హత్య చేసి ఉప్పుటేరులో పడేసినట్లు ఒప్పుకున్నట్లు సమాచారం.

రంగంలోకి ధర్మాడి సత్యం టీం..
సవతి తల్లి చిన్నారిని తీసుకెళ్లటంతో తాము ఏమి అడగలేకపోయామని స్థానికులు చెబుతున్నారు. అయితే, విచారణలో చిన్నారిని తానే చంపి గోనేసంచిలో కట్టి ఉప్పుటేరులో పడేసినట్లు శాంతికుమారి పోలీసులకు చెప్పినట్టు తెలుస్తోంది. కానీ, పొంతన లేని సమాధానాలతో అమె చెబుతున్న విషయాల పైన స్పష్టత రావటం లేదన పోలీసులు అంటున్నారు. అయినా..మె ఇచ్చిన సమాచారం మేరకు ధర్మాడి సత్యం బృందం రంగంలోకి దిగింది. గాలింపు చర్యలు మొదలు పెట్టింది. మొత్తం నాలుగు పడవల ద్వారా ఉప్పుటేరు, ఇంద్రపాలెం లాకులు వద్ద దీప్తిశ్రీ ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. అయితే దీప్తిశ్రీ మృతదేహం దొరికిన తర్వాతే అన్ని విషయాలు పోలీసులు వెల్లడించే అవకాశం ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications