ఏపీలోని ఈ మండలాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొన్ని రోజులు వర్షాలు కురిసినప్పటికీ.. ఇప్పుడు మళ్లీ ఎండలు మండిపోతున్నాయి. ప్రజలు ఇంటి నుంచి బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఉదయం పదిగంటలు దాటిన తర్వాత ఎండతీవ్రత ఎక్కువగా ఉంటోంది. మరోవైపు, ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు.
ఈ క్రమంలోనే ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కీలక హెచ్చరికలు జారీ చేసింది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు తోడుగా.. తీవ్రమైన వడగాల్పులు కూడా వీస్తాయని హెచ్చరించింది. ప్రజలంతా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. సోమవారం(మే 27) 72 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 200 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.

మంగళవారంనాడు 165 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 149 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. తీవ్రవడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలా(72)ల్లో
శ్రీకాకుళం 3, విజయనగరం17, పార్వతీపురంమన్యం 10, అల్లూరి 2, అనకాపల్లి 2, కాకినాడ 6, కోనసీమ 2, తూర్పుగోదావరి 17, పశ్చిమగోదావరి 3, ఏలూరు 7, కృష్ణా 2, బాపట్ల కొల్లూరు మండలంలో తీవ్రవడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.
సోమవారం వడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలా(200)ల్లో
శ్రీకాకుళం 12, విజయనగరం 7, పార్వతీపురంమన్యం 5, అల్లూరిసీతారామరాజు 8, విశాఖ 1, అనకాపల్లి 14, కాకినాడ 14, కోనసీమ11, తూర్పుగోదావరి 2, పశ్చిమగోదావరి 13, ఏలూరు 21, కృష్ణా 19, ఎన్టీఆర్ 17, గుంటూరు 17, పల్నాడు 12, బాపట్ల 19, ప్రకాశం 8 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు. అవసరమైతేనే బయటికి వెళ్లాలని, అలా బయటికి వెళ్లేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.












Click it and Unblock the Notifications