రేవ్‌ పార్టీపై దాడి: తప్పతాగి అశ్లీల నృత్యాలు, సెక్స్ రాకెట్ గుట్టురట్టు

రహస్యంగా సాగిస్తున్న సెక్స్ రాకెట్ గుట్టురట్టయింది. అర్ధరాత్రి వరకు తప్పతాగి అశ్లీల నృత్యాలు, వ్యభిచార కార్యకలాపాలు సాగిస్తూ రేవ్‌ పార్టీ జరుపుకొంటున్న స్థావరంపై పోలీసులు దాడి చేశారు.

పశ్చిమగోదావరి: రహస్యంగా సాగిస్తున్న సెక్స్ రాకెట్ గుట్టురట్టయింది. అర్ధరాత్రి వరకు తప్పతాగి అశ్లీల నృత్యాలు, వ్యభిచార కార్యకలాపాలు సాగిస్తూ రేవ్‌ పార్టీ జరుపుకొంటున్న స్థావరంపై పోలీసులు దాడి చేశారు. 16 మంది యువకులను, నిర్వాహకురాలిని అరెస్ట్‌ చేశారు. అశ్లీల నృత్యాలు చేస్తున్న మరో 9 మంది యువతులను అదుపులోకి తీసుకుని స్వధార్‌హోంకు తరలించారు.

పశ్చిమగోదావరి జిల్లా నిడమర్రు మండలం పత్తేపురం గ్రామ శివారులో ఉన్న ఓ ప్రైవేటు గెస్ట్‌హౌస్‌లో ఫిబ్రవరి 26 అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ మేరకు ఏలూరులో డీఎస్పీ గోగుల వెంకటేశ్వరరావు సోమవారం వివరాలను వెల్లడించారు. పత్తేపురం శివారు ఆముదాలపల్లి పరిధిలో ఉన్న చింతలపాటి మూర్తిరాజు గెస్ట్‌ హౌస్‌లో అశ్లీల నృత్యాలు జరుగుతున్నాయని సమాచారం రావటంతో ఫిబ్రవరి 26న అర్ధరాత్రి గణపవరం సీఐ ఎన్‌ దుర్గాప్రసాద్‌ తన సిబ్బందితో కలిసి దాడి చేశారని తెలిపారు.

sex racket: 16 youth, 9 girls held in West Godavari district

అక్కడ అశ్లీల నృత్యాలు చేస్తున్న తాడేపల్లిగూడెం, భీమవరం, పాలకొల్లు, విజయవాడ ప్రాంతాలకు చెందిన 16 మంది యువకులను అరెస్ట్‌ చేశామన్నారు. వీరితో పాటు హైదరాబాదు, విజయవాడ నుంచి ఇక్కడకు వచ్చిన 9 మంది యువతులను అదుపులోకి తీసుకుని స్వధార్‌హోంకు తరలించినట్లు చెప్పారు. వీరిని ఇక్కడకు తీసుకువచ్చిన నిర్వాహకురాలు, హైదరాబాద్‌కు చెందిన బళ్లా హేమను అరెస్ట్‌ చేసినట్లు డీఎస్పీ తెలిపారు.

రేవ్‌పార్టీ ఏర్పాటు చేసిన పత్తేపురానికి చెందిన నిర్వాహకులు చింతలపాటి చినమూర్తిరాజు, చింతలపాటి గిరిరాజులు పరారీలో ఉన్నారని వారిని త్వరలో అరెస్ట్‌ చేస్తామన్నారు. జిల్లాలో ఈ తరహా కార్యకలాపాలు పునరావృతం కాకుండా కట్టుదిట్టం చేస్తామని డీఎస్పీ వెంకటేశ్వరరావు తేల్చి చెప్పారు. డబ్బు ఆశచూపి పేద యువతులను తీసుకు వచ్చి.. ఈ రొంపిలోకి దించుతున్న నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+