సెక్స్ రాకెట్లో అద్దె భార్యలు: పెన్ కెమెరాతో రాసలీలల చిత్రీకరణ

Posted By:
Subscribe to Oneindia Telugu
  పీరియడ్స్(రుతుస్రావం)లో ఉన్నామని చెప్పి డేరా బాబా 'సెక్స్' ఆకృత్యాల నుంచి ఎస్కేప్ | Oneindia Telugu

  గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరులో ఓ సెక్స్ రాకెట్ గట్టు రట్టయింది. పోలీసులు దోపిడీ కేసు మిస్టరీని ఛేదించడానికి ప్రయత్నిస్తుంటే సెక్స్ రాకెట్ గుట్టు వెలుగులోకి వచ్చింది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న మహిళలను లోబర్చుకుని వారిద్వారా విటులకు వలవేసి డబ్బులు గుంజుతున్న ముఠా పోలీసులకు చిక్కింది.

  పాత గుంటూరులో జరిగిన ఓ దోపిడీ కేసులో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తుండగా సెక్స్‌ రాకెట్‌ వ్యవహారం బయటపడింది. గుంటూరు అర్బన్‌ ఎస్పీ సీహెచ్‌ విజయరావు ఇందుకు సంబంధించిన వివరాలను అందించారు.

  గుంటూరులోని కేవీపీ కాలనీకి చెందిన పుప్పాల మణికంఠ పలు దోపిడీలు, దొంగతనం కేసుల్లో నిందితుడు. తాడికొండలో వడ్డీ వ్యాపారం చేసి నష్టపోయిన గుడివాడ భవానితో అతడికి పరిచయం ఏర్పడింది.

  దంపతుల్లా నటిస్తూ...

  దంపతుల్లా నటిస్తూ...

  మణికంఠ, భవానీ తెనాలిలో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని దంపతుల్లా నటిస్తూ గుర్తు తెలియని నంబర్లకు మిస్డ్‌ కాల్స్‌ ఇస్తూ వారిని ముగ్గులోకి దించేవారు. మణికంఠ పెన్‌ కెమెరాలతో వారి శృంగార దృశ్యాలను రహస్యంగా చిత్రీకరించేవాడు. వాటిని చూపించి బ్లాక్‌మెయిల్ చేస్తూ విటుల నుంచి భారీ మొత్తంలో డబ్బు వసూలు చేసేవారు. తన ఫొటోతో వేరే పేరుతో ప్రముఖ చానల్‌ రిపోర్టర్‌గా నకిలీ ఐడీ కార్డును కూడా సృష్టించుకున్నాడు.

  ఇలా ముగ్గులోకి దించాడు...

  ఇలా ముగ్గులోకి దించాడు...

  గుంటూరు సమీపంలోని చిలకలూరిపేట హైవేపై పొత్తూరు సమీపంలోని మై హోమ్స్‌ అపార్టుమెంట్‌లో ఫ్లాటును మణికంఠ, భవానీ అద్దెకు తీసుకున్నారు. కొద్దిరోజులకే భవాని ఈ పని చేయనంటూ వెళ్లిపోయింది. దీంతో తనకు పరిచయమున్న కేతావత్‌ పద్మను ఈ ఉచ్చులోకి లాగాడు.

  ఇలా లక్షలు వసూలు

  ఇలా లక్షలు వసూలు

  హైదరాబాద్‌కు చెందిన ఓ బిల్డర్‌ నుంచి రూ.9లక్షలు, ప్రత్తిపాడుకు చెందిన టీచర్‌ నుంచి రూ.65వేలు, చీరాలలోని కిరాణాషాపు వ్యాపారి నుంచి రూ.60 వేలు, పెదకాకానిలో సెల్‌షాపు నిర్వాహకుడి నుంచి రూ.10 వేలు ఇలా పలువురు వ్యాపారులు, ఉద్యోగుల నుంచి లక్షల్లో మణికంఠ బ్లాక్ మెయిల్ చేసి వసూలు చేశాడు.

   ఇలా కూడా..

  ఇలా కూడా..

  అది అలా ఉంటే, నల్లచెరువుకు చెందిన ములుగూరి రాణితో కలిసి మణికంఠ ఈనెల 5న పాతగుంటూరులోని ఓ ఇంట్లోకి వెళ్ళి వృద్ధురాలిని కత్తితో బెదిరించి 5సవర్ల బంగారు ఆభరణాలు దోచుకెళ్లాడు. ఆ కేసులో పోలీసులు వారిని అదుపులోకి తీసుకోవడంతో ఈ సెక్స్‌రాకెట్‌ వ్యవహారం బయటపడింది.

  ఆ ముగ్గురి అరెస్టు

  ఆ ముగ్గురి అరెస్టు

  దోపిడీ, సెక్స్‌ రాకెట్‌ కేసుల్లో పోలీసులు మణికంఠ, రాణి, కేతావత్‌ పద్మను పోలీసులు అరెస్టు చేశారు. వారినుంచి 5సవర్ల బంగారు ఆభరణాలు, రూ.45వేల నగదు, 10సెల్‌ఫోన్లు, పెన్‌ కెమెరా, పెన్‌ డ్రైవ్‌లను స్వాధీనం చేసుకున్నారు. తనను అశ్లీల వీడియోలతో మణికంఠ బెదిరిస్తున్నాడని గుడివాడ భవాని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దానిపైనా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Manikanta along with Kethavath Padma and Rani have been arrested in decoity and sex rocket cases at Guntur of Andhra Pradesh.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి