సెక్స్ రాకెట్ రట్టు: ముంబై, ఢిల్లీకి చెందిన యువతులు!
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో స్పెషల్ ఆపరేషన్ టీమ్ పోలీసులు ఆదివారం సాయంత్రం ఓ రేవ్ పార్టీని రట్టు చేసిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. జవహర్ నగర్‌లోని ఓ ఇంటి పైన పోలీసులు దాడి చేసి, యువతీ, యువకులను అరెస్టు చేశారు.
అయితే, ఇందులో కేవలం రేవ్ పార్టీ మాత్రమే కాకుండా.. సెక్స్ రాకెట్ నిర్వహించినట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. పోలీసులు ఇందుకు సంబంధించి ముగ్గురు యువతులను కాపాడారు. యువతులు ముగ్గురు కూడా 21 నుండి 25 ఏళ్ల వయస్సున్న వారే. వారిని ముంబై, ఢిల్లీ, ఒడిశా తదితర రాష్ట్రాల నుండి తీసుకు వచ్చినట్లుగా సమాచారం.
పోలీసులు ముగ్గురు యువతులతో పాటు ఆరుగురు యువకులను అరెస్టు చేశారు. అరెస్టు సమయంలో కస్టమర్స్ ఉన్నారని తెలుస్తోంది. వారి వద్ద నుండి రూ.25వేల నుండి రూ.50వేల వరకు వసూలు చేస్తున్నట్లుగా సమాచారం. పోలీసులు వారి నుండి రూ.41,910 రూపాయలు, పది సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

తూగో జిల్లాలో పెట్రోల్ ట్యాంకర్ బోల్తా
తూర్పు గోదావరి జిల్లాలోని పెద్దాపురం వద్ద ఏడీపీ రోడ్డుపై పెట్రోల్ ట్యాంకర్ బోల్తా పడింది. ట్యాంకర్ నుంచి పెట్రోల్ లీకవుతుండటంతో పెద్ద సంఖ్యలో జనం పెట్రోల్‌ను బాటిళ్లు, క్యాన్లతో పట్టుకునేందుకు పోటీ పడ్డారు. రెవెన్యూ, పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరుగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. వర్షం కారణంగా టైర్లు జారడంతో ట్యాంకర్ బోల్తా పడినట్లు స్థానికులు చెబుతున్నారు.
అంతర్రాష్ట్ర దొంగలు అరెస్టు
అనంతపురం జిల్లాలో పోలీసులు నలుగురు అంతర్రాష్ట్ర దొంగలను అరెస్టు చేశారు. వారి నుండి 66 కిలోల బంగారం, 2 కిలోల వెండి, 3.5 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.
డాక్టర్ కారు లభ్యం
హైదరాబాదు నుండి తెనాలు వస్తూ శనివారం ఓ డాక్టర్ అదృశ్యమయ్యారు. ్తని పేరు జయచంద్రన్. అతని కారు సోమవారం లభ్యమైంది. దుగ్గిరాల వద్ద కృష్ణా పశ్చిమ డెల్టా ప్రధాన కాలువలో కారును గుర్తించారు. జయచంద్రన్ కోసం పోలీసులు కాల్వలో గాలిస్తున్నారు.












Click it and Unblock the Notifications