ఐదేళ్ల చిన్నారిని పొదల్లోకి లాక్కెళ్లి.. ప్రతిఘటించడంతో వాతలు తేలేలా!
పొదల్లో అతను లైంగిక దాడికి యత్నించడంతో బాలిక గట్టిగా కేకలు పెట్టింది. దీంతో చింత బరిగెలతో ఆమెను విచక్షణా రహితంగా చితకబాదాడు.
వినుకొండ: మదమెక్కిన ఓ కామాంధుడు ముక్కుపచ్చలారని చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ప్రతిఘటించిందన్న కారణంతో చింత బరిగెలతో వాతలు తేలేలా చితకబాదాడు. స్థానికుల అప్రమత్తతో చిన్నారి ఆ కామాంధుడి చెర నుంచి బయటపడగా.. ప్రస్తుతం అతను పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.
వివరాల్లోకి వెళ్తే.. బొల్లాపల్లి మండలం గండిగనుముల పంచాయతీ పరిధిలోని చక్రాయపాలెం గ్రామానికి చెందిన దంపతుల పెద్ద కుమార్తె (5) గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో 1వ తరగతి చదువుతోంది. అదే గ్రామానికి చెందిన కేతావత్ ఆంజనేయులు నాయక్ సోమవారం సాయంత్రం చింతకాయలు కోసిస్తానంటూ బాలికను ఊరి చివర ఉన్న పొదల్లోకి లాక్కెళ్లాడు.

పొదల్లో అతను లైంగిక దాడికి యత్నించడంతో బాలిక గట్టిగా కేకలు పెట్టింది. దీంతో చింత బరిగెలతో ఆమెను విచక్షణా రహితంగా చితకబాదాడు. రక్తం కారుతూ ఏడుస్తున్న బాలికను అటువైపుగా వెళ్తున్న వకుడావత్ సంద్రీబాయి, కేతావత్ సుశీలబాయి గమనించారు. వారిద్దరు బాలిక వద్దకు వచ్చే లోపు.. ఆంజనేయులు నాయక్ అక్కడి నుంచి పరారయ్యాడు.
అనంతరం బాలిక తల్లిదండ్రులకు విషయం చేరవేయడంతో.. స్థానిక ఆర్ఎంపీ వద్ద ప్రథమ చికిత్స చేయించారు. అక్కడి నుంచి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాలిక పరిస్థితి ఆందోళనకరంగానే ఉన్నట్లు తెలుస్తోంది.
ఆసుపత్రి సిబ్బంది పోలీసులకు సమాచారమివ్వడంతో స్థానిక ఎస్ఐ బాధితురాలి కుటుంబ సభ్యులను, చిన్నారిని విచారించి కేసు నమోదు చేశారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.












Click it and Unblock the Notifications