లైంగిక వేధింపుల కేసుతో చిక్కులు: ఎవరీ గజల్ శ్రీనివాస్?

Posted By:
Subscribe to Oneindia Telugu
  గజల్ శ్రీనివాస్ గదిలో నగ్నంగా : అలాంటివాడు కాదంటూ మరో కోణం ?

  హైదరాబాద్: లైంగిక వేధింపుల కేసులో అరెస్టు కావడంతో గజల్ శ్రీనివాస్ చిక్కుల్లో పడ్డారు. పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. అయితే, ఆయనకు పేరు ప్రఖ్యాతులు మెండుగానే ఉన్నాయి. ప్రస్తుత కేసుతో ఆయన వ్యక్తిత్వంపై మచ్చ పడింది.

  కేసు బలంగానే ఉందని పోలీసులు అంటున్నారు. గజల్ శ్రీనివాస్‌గా పేరు సంపాదించుకున్న ఆయన ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో సమైక్య ఉద్యమానికి బాసటగా నిలచారు. సమైక్యాంధ్ర కోసం పాటలు కట్టి ప్రదర్శనలు ఇచ్చారు.

   అసలు పేరు ఇదీ..

  అసలు పేరు ఇదీ..

  గజల్ శ్రీనివాస్‌గా ప్రసిద్ధి చెందిన కేశిరాజు శ్రీనివాస్ తెలుగు గజల్ గాయకుడు. గజల్ శ్రీనివాస్ 125 ప్రపంచ భాషలలో గాంధేయవాదంపై గజల్స్ పాడారు. తద్వారా మూడు గిన్నీస్ ప్రపంచ రికార్డులను, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్ నెలకొల్పాడు.

   ఆయన జన్మించింది శ్రీకాకుళం జిల్లాలో..

  ఆయన జన్మించింది శ్రీకాకుళం జిల్లాలో..

  శ్రీనివాస్ శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో 1966 అక్టోబర్ 14వ తేదీన జన్మించారు. అతని తండ్రి అదే జిల్లాలో పంచాయతీ అధికారిగా పనిచేశారు. శ్రీనివాస్ తల్లిదండ్రులు రత్నావళి, నరసింహరావు. ఇల్లాలు సురేఖ, ఏకైక పుత్రిక సంస్కృతి. ప్రపంచభాషల్లో శాంతి గీతాలు పాడడం ద్వార ఇరాన్‌, ఇరాక్‌ లాంటి దేశాల నుంచి ఆయనకు ఆహ్వానాలు అందాయి. అంటార్కిటికా ఖండంలో తప్ప మిగతా ప్రపంచంలో మొత్తం ఆరు వేల కచేరీలు చేశారు.

   తెలుగు తోరణం పేరుతో పర్యటనలు

  తెలుగు తోరణం పేరుతో పర్యటనలు

  శ్రీనివాస్ అమెరికాలో అనేక సార్లు పర్యటించి తెలుగు తోరణం అనే పేరుతో కార్యక్రమాలు నిర్వహించారు. తాను సుమారు 60 గజళ్లను రాశానని, సినారే, డాక్టర్‌ తాటపర్తి రాజగోపబాలం, రెంటాల వేంకటేశ్వరరావుల గజళ్లను గానం చేస్తుంటానని ఆయన చెబుతుంటారు.

   చారిటబుల్ ట్రస్టు ఏర్పాటు..

  చారిటబుల్ ట్రస్టు ఏర్పాటు..

  తాను పుట్టిన శ్రీకాకుళం జిల్లాలో గజల్‌ శ్రీనివాస్‌ ఫౌండేషన్‌ ఛారిటబుల్‌ ట్రస్టు ద్వారా విస్తృతంగా వైద్యసేవలు, అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు గజల్ శ్రీనివాస్‌ గతంలో చెప్పారు. ప్రపంచ ప్రసిద్ధ లాజరస్‌ ఆసుపత్రికి సాంస్కృతిక రాయబారిగా తాను ఉన్నందున ఇచ్ఛాపురం, కవిటి వంటి ప్రాంతాలను దత్తత తీసుకొని ప్రముఖ వైద్య నిపుణులతో సేవలందిస్తానని తెలిపారు. నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్‌ వ్యాధి బారిన పడిన పలుగ్రామాలను దత్తత తీసుకొని వైద్యసేవలందిస్తున్నట్లు కూడా తెలిపారు.

   ఆయనకు పురస్కారాలు ఇవీ..

  ఆయనకు పురస్కారాలు ఇవీ..

  గజల్ శ్రీనివాస్‌కు పురస్కారాలు దండిగానే వచ్చాయి. ఆయనకు ఈ కింద ఇచ్చిన పురస్కరాలు లభించాయి..

  డా.బి.ఆర్.అంబేద్కర్ సేవాసమితి -డా.బి.ఆర్.అంబేద్కర్ జీవన సాఫల్య పురస్కారం
  కళావేదిక, విశాఖపట్నం - ఉగాది పురస్కారం
  రోటరీ ఇన్‌టర్నేషనల్ - ఒకేషనల్ ఎక్సలెన్సీ పురస్కారం
  లయన్స్ ఇన్‌టర్నేషనల్ - ఒకేషనల్ ఎక్సలెన్సీ పురస్కారం
  జేసీస్ క్లబ్ - అవుట్ స్టాండింగ్ యంగ్ పర్సన్ పురస్కారం
  తెలుగు విజ్ఞానసమితి బెంగళూరు - తెలుగు విజ్ఞానసమితి పురస్కారం
  తెలుగు ఇన్‌టాక్ మలేషియా - మలేషియా ఉగాది పురస్కారం
  ఆస్ట్రేలియా సిడ్నీ తెలుగు అసోసియేషన్ - తెలుగు అసోసియేషన్ పురస్కారం
  యూరోపియన్ తెలుగు అసోసియేషన్ - ఈటా పురస్కారం
  తెలుగు కళాసమితి - అంతర్జాతీయ సద్భావనా పురస్కారం

  గజల్ శ్రీనివాస్‌కు ఈ బిరుదులు

  గజల్ శ్రీనివాస్‌కు ఈ బిరుదులు

  గజల్ మాస్ట్రో

  గజల్ గానగంధర్వ
  గజల్ గానప్రపూర్ణ
  గజల్ గానవిశారద
  గజల్ గానచిరంజీవి
  గజల్ గానసమ్రాట్
  గజల్ గానవిభూషణ
  గజల్ మొఘల్
  గజల్ గాయకపాదుషా
  గజల్ గానబ్రహ్మ
  గజల్ స్వరభూషణ
  ప్రైడ్ ఆఫ్ ఇండియా

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Kesiraju Srinivas, popularly known as Ghazal Srinivas, holds the Guinness World Record for most languages sung.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి

  X