ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా షేక్ సాబ్జీ .. మొదటి రెండు రౌండ్లలోనే భారీ ఆధిక్యం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈనెల 14వ తేదీన జరిగిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపులో ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గా షేక్ సాబ్జి గెలుపొందారు. 1537 ఓట్ల మెజారిటీతో యుటిఎఫ్ అభ్యర్థిగా బరిలోకి దిగిన షేక్ సాబ్జి విజయం సాధించారు .

ఈరోజు ఉదయం 8 గంటల నుండి ప్రారంభమైన లెక్కింపులో భాగంగా ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం ఓట్లను కాకినాడ జేఎన్టీయూలో లెక్కించారు.

Shaik Sabjee as the teachers MLC of Godavari districts ..huge lead in the first two rounds

కృష్ణ- గుంటూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం ఓట్లను గుంటూరు ఏసీ కాలేజీలో లెక్కిస్తున్నారు. గుంటూరు కృష్ణా జిల్లాలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు కల్పలత ముందంజలో ఉన్నారు.

ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పిడిఎఫ్ బలపరిచిన యుటిఎఫ్ అభ్యర్థి షేక్ సాబ్జి తన సమీప ప్రత్యర్థి పిఆర్టియు మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన గంధం నారాయణ రావు పై విజయం సాధించారు . షేక్ సాబ్జీ కి మొత్తం 7,983 ఓట్లు పోల్ అవ్వగా , నారాయణ రావు 6,446 ఓట్లు వచ్చాయి .

తర్వాతి స్థానంలో చెరుకూరు సుభాష్ చంద్రబోస్ కు 706 ఓట్లు, ఇళ్ల సత్యనారాయణకు 300 మొదటి ప్రాధాన్యత ఓట్లు వచ్చినట్లుగా తెలుస్తుంది. గోదావరి జిల్లాల పరిధిలో మొత్తం 17 , 465 మంది ఓటర్లు ఉండగా 16,054 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 11 మంది అభ్యర్థులు పోటీలో నిలువగా ఫలితాలు లెక్కింపు మొదటి రెండు రౌండ్లలోనే విజేత ఎవరో తేలిపోయింది. నువ్వా నేనా అన్నట్టు గా హోరాహోరీగా జరిగిన ఎన్నికలలో ఫైనల్ గా ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా షేక్ సాబ్జీ విజయ కేతనం ఎగురవేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+