హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా వద్దు: శైలజానాథ్

సీమాంధ్ర ప్రజలు స్వచ్ఛందంగానే సమైక్యాంధ్ర కోసం ఉద్యమిస్తున్నారని, సీమాంధ్ర ఉద్యమాన్ని హోం శాఖ గుర్తించిందని ఆయన అన్నారు. రాష్ట్ర విభజనపై మార్పులు, చేర్పులు జరగవచ్చునని హోం శాఖ అధికారులను కలిసిన సీమాంధ్ర నాయకులు అన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కేంద్ర హోం శాఖ కార్యదర్శిని కోరినట్లు వారు తెలిపారు.
జంతర్ మంతర్ వద్ద దీక్షలు
కాగా, అక్టోబర్ 2వ తేదీన ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సమైక్యాంధ్ర డిమాండుతో దీక్షలు చేయాలని సమైక్యాంధ్ర విద్యార్థి జెఎసి నిర్ణయించింది. కడపలో 14 విశ్వవిద్యాలయాలకు చెందిన విద్యార్థి జెఎసిలు సమావేశమై గురువారం ఆ మేరకు నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పాఠశాలలు తెరిచే వరకు ప్రైవేట్ పాఠశాలలను మూసేయాలని నిర్ణయించారు.
వచ్చే నెల 3వ తేదీన ఢిల్లీలో రాహుల్ గాంధీని కలిసి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరాలని నిర్ణయం తీసుకున్నారు. వచ్చే నెల 4వ తేదీన ఢిల్లీలోని సీమాంధ్ర నేతల ఇళ్లు ముట్టడించాలని విద్యార్థి జెఎసిల సమావేశం నిర్ణయం తీసుకుంది. సీమాంధ్ర కేంద్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు రాజీనామా చేయాలని విద్యార్థి జెఎసి నాయకులు డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications