సోనియా తెలంగాణ: శంకరన్న, నోరు జారింది: పితాని
హైదరాబాద్/ ఏలూరు : విభజన తర్వాత ఏర్పడే కొత్త రాష్ట్రానికి 'సోనియా తెలంగాణ' అని పేరు పెట్టాలని మాజీ మంత్రి, కాంగ్రెసు శాసనసభ్యుడు పి. శంకర్రావు డిమాండ్ చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై తీవ్రంగా విరుచుకుపడ్డారు.
ప్రజల కోసం ఏర్పాటు చేసిన రచ్చబండలో కిరణ్ కుమార్ రెడ్డి పిచ్చికుక్కలా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చీడపురుగు కంటే హీనుడని, ఈ నెలాఖరులోగా ముఖ్యమంత్రి బిస్తర్ సర్దుకోవాల్సిందేనని శంకరరావు వ్యాఖ్యానించారు.

మంత్రి కన్నా లక్ష్మీనారాయణను మరో ముఖ్యమంత్రి అన్న వ్యాఖ్యలపై మంత్రి పితాని సత్యనారాయణ వివరణ ఇచ్చారు. తాను ఉద్దేశపూర్వకంగా అలా మాట్లాడలేదని ఆయన తెలిపారు. ఇలాంటి వ్యాఖ్యలు ఇబ్బంది కలిగిస్తాయని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి కూడా అన్నారని మంత్రి పితాని సత్యనారాయణ వెల్లడించారు.
కన్నా లక్ష్మినారాయణను ఉద్దేశించి పితాని సత్యనారాయణ మరో మంత్రి అనడానికి బదులు మరో ముఖ్యమంత్రి అనడం చర్చనీయాంశంగా మారింది. కిరణ్ కుమార్ రెడ్డి స్థానంలో కన్నా ముఖ్యమంత్రిగా వస్తారని ప్రచారం సాగిన నేపథ్యంలో పితాని సంబోధన వేడి పుట్టించింది.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు












Click it and Unblock the Notifications