Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

TTD: శ్రీవారి ఆలయంలో మహా శాంతి యాగం..!!

Tirumala: తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో టీటీడీ సంప్రోక్షణ మొదలు పెట్టింది. శ్రీవారి లడ్డూ అపవిత్రం అయిందనే వార్తలు పెను సంచలనంగా మారాయి. దీంతో, టీటీడీ తిరుమలలో మహా శాంతి యాగం ప్రారంభించింది. అర్చకులు సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.

శాంతి హోమం
తిరుమల లడ్డూ అపవిత్రమైందన్న ప్రచారం నేపథ్యంలో టీటీడీ శాంతి హోమం చేపట్టింది. సోమవారం రోహిణి నక్షత్రం శ్రీవారికి ముహూర్త బలం కావడంతో..ఈ రోజు తెల్లవారుజామున 6 గంటలకు మొదలైన హోమం 10 గంటల వరకు కొనసాగనుంది. లడ్డూ పవిత్రత దోష పరిహారం కోసమే యాగ నిర్వహణ నిర్వహిస్తున్నట్లు అర్చకులు చెబుతున్నారు. సందేహాల నడుమ ముందుకు సాగలేమని.. అందుకే శాంతియాగం నిర్వహిస్తున్నామని ఆలయ అర్చకులు రామకృష్ణ దీక్షితులు వెల్లడించారు.

Shanti Homam Ritual Tirumala Temple by ttd to Ward Off Evil Effects

సంప్రోక్షణ
విమాన ప్రాకారం దగ్గర 3 హోమ గుండాలతో మహా క్రతువు కొనసాగుతోంది. 8 మంది అర్చకులు, ముగ్గురు ఆగమ సలహాదారులతో యాగం నిర్వహిస్తున్నారు. సమస్త దోష పరిహారం, సంశయాల నివృత్తి కోసం ప్రత్యేక సంకల్పంతో యాగం ఏర్పాటు చేసింది టీటీడీ. లడ్డూ పోటు, ద్రవ్యశాల, ఆలయ ప్రాంగణంతో పాటు గర్భాలయంలో సంప్రోక్షణ చేయాలని నిర్ణయించారు. హోమం తర్వాత పంచగవ్య ప్రోక్షణ నిర్వహించనున్నారు.

సిట్ ఏర్పాటు
శ్రీవారి ఆలయంలోని బంగారు బావి దగ్గర యాగశాలలో మూడు హోమ గుండాలు ఏర్పాటు చేశారు. పాత్రశుద్ధి, యంత్రశుద్ధి, స్థల శుద్ధితో పాటు పంచగవ్య ప్రోక్షణతో శాంతి హోమం కొనసాగుతోంది. శాంతిహోమంలో ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, ఆలయ అర్చకులు, ఆగమ సలహాదారులు పాల్గొన్నారు. తిరుమల లడ్డూ అంశం రాజకీయ వివాదంగా మారింది. ఈ వ్యవహారం పైన విచారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+