• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

లోకేష్ పైనే గురి.. : ష‌ర్మిళ కు తోడుగా బుట్టా రేణుక : ప‌వ‌న్ పై ఏం మాట్లాడుతారు.!

|

జ‌గ‌నన్న వ‌దిలిన బాణంగా చెప్పుకొనే ఆయ‌న సోద‌రి ష‌ర్మిళ ఎన్నిక‌ల ప్ర‌చార బ‌రిలోకి దిగారు. చంద్ర‌బాబు త‌న‌యు డు లోకేష్ ల‌క్ష్యంగా ష‌ర్మిళ మంగ‌ళ‌గిరి నుండి ప్ర‌చారం ప్రారంభించారు. జ‌గ‌న్ త‌ల్లి విజ‌య‌మ్మ సైతం ఎన్నిక‌ల ప్ర‌చా ర ప‌ర్వంలో కాలు పెట్టారు. ప్ర‌కాశం జిల్లా నుండి ప్ర‌చారం ఆరంభించారు. ఇక‌, ష‌ర్మిళ ప్ర‌సంగాపై ఇప్పుడు రాజ‌కీయం గా ఆస‌క్తి నెలకొంది.

ఎన్నికల ప్రచారంలో జగన్: హోరెత్తిన జనం (ఫొటోలు)

జ‌గ‌న్ కు తోడుగా త‌ల్లి..సోద‌రి..

జ‌గ‌న్ కు తోడుగా త‌ల్లి..సోద‌రి..

ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్ రెడ్డి తల్లి వైఎస్ విజయలక్ష్మీ, సోదరి షర్మిల నేటి నుంచి ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఇడుపులపాయలోని వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఘాట్‌ వద్ద నివాళులర్పించిన విజయమ్మ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా నేడు ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. కందుకూరు లో తొలి ప్ర‌చార స‌భ‌లో పాల్గొంటారు. మధ్యాహ్నం 1 గంటకు కనిగిరి, సాయంత్రం 4 గంటలకు మార్కాపురంలో జరిగే బహిరంగ సభలో ఆమె ప్రసంగించనున్నారు. రాత్రికి విజయమ్మ మర్కాపురంలోనే బస చేస్తారు. శనివారం ఉదయం 10 గంటలకు యర్రగొండపాలెంలో జరిగే ఎన్నికల ప్రచార సభలో విజయమ్మ పాల్గొననున్నారు. షర్మిల కూడా నేటి నుంచే ప్రచారం ప్రారంభించనున్నారు. ఆమె నారా లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరి నియోజకవర్గంలోని తాడేపల్లి నుంచి బస్సు యాత్రను ప్రారంభిస్తారు.

 లోకేష్ పైనే గురి...

లోకేష్ పైనే గురి...

అన్న వ‌దిలిన బాణం తొలి లక్ష్యంగా నారా లోకేష్‌. మంగ‌ళ‌గిరి నుండి తొలి సారి ప్రత్య‌క్ష ఎన్నిక‌ల్లో పోటీ చేస్తున్న టిడిపి అధినేత చంద్ర‌బాబు త‌నయుడు ను ల‌క్ష్యంగా చేసుకున్నారు. తొలుత మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని ఉండ‌వ‌ల్లిలో భూములు కోల్పోయిన రైతుల ప‌రామ‌ర్శ తో ష‌ర్మిళ ప్ర‌చారం ప్రారంభ‌మైంది. పూర్తిగా ఒక రోజు ఇదే నియోజ‌క‌వ‌ర్గానికి కేటాయించారు. ఇక‌, మంగ‌ళ‌గిరి లో చేనేత వ‌ర్గానికి చెందిన వారు ఎక్కువ‌గా ఉండ‌టంతో.. అదే వ‌ర్గానికి చెందిన మ‌హిళా నేత‌ల‌తో క‌లిసి ష‌ర్మిళ ప్ర‌చారం ప్రారంభించారు. క‌ర్నూలు ఎంపి..వైసిపి నుండి టిడిపిలోకి వెళ్లి అక్క‌డ మోస‌పోయాన‌ని చెబుతూ వైసిపి లో తిరిగి చేరిన బుట్టా రేణుక సైతం ష‌ర్మిళ తో క‌లిసి మంగ‌ళ‌గిరి లో ఎన్నిక‌ల ప్ర‌చారం లో పాల్టొంటున్నారు. టిడిపిలో చేనేత వ‌ర్గానికి చెందిన మ‌హిళ‌ను ఏ ర‌కంగా మోసపోయిందీ వివ రించ‌నున్నారు. ఇక‌, స్థానిక బిసి మ‌హిళా నేత‌..మాజీ ఎమ్మెల్యే కాండ్రు క‌మ‌ల సైతం ష‌ర్మిళ కు మ‌ద్ద‌తుగా ప్ర‌చారం లో పాల్గొంటున్నారు.

ష‌ర్మిళ ప్ర‌సంగాల‌పైనే ఫోక‌స్‌..

ష‌ర్మిళ ప్ర‌సంగాల‌పైనే ఫోక‌స్‌..

గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో ష‌ర్మిళ తండ్రి హాహ భావాల‌తో ప్ర‌చార స‌భ‌ల్లో ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ గా నిలిచారు. ఇప్పుడు మ‌రో 12 రోజుల్లో ఎన్నిక‌ల ప్ర‌చారం ముగుస్తున్న వేళ‌..ష‌ర్మిళ ప్ర‌చార షెడ్యూల్ ను ప‌క్కా వ్యూహాత్మ‌కంగా సిద్దం చేస్తున్నారు. జ‌గ‌న్ ఇప్ప‌టి వ‌ర‌కు వెళ్ల‌ని నియోజ‌క‌వ‌ర్గాల‌తో పాటుగా..టిడిపి నేత‌లు బలంగా ఉన్న ప్రాంతాలు..అదే విధంగా పార్టీ అభ్య‌ర్దుల ప్ర‌చారం బ‌ల‌హీనంగా ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల్లో ష‌ర్మిళ ప్ర‌చారం కొన‌సాగ‌నుంది. ఈ ఎన్నిక‌ల్లో ఎక్క‌డికక్క‌డ స్థానిక నేత‌ల‌ను క‌లుపుకొని ష‌ర్మిళ ప్ర‌చారం చేస్తారు. అయితే, విజ‌య‌మ్మ‌-ష‌ర్మిళ క‌లిసి కాకుండా..ఇద్ద‌రికీ విడివిడిగా ప్ర‌చార షెడ్యూల్ ను ఖ‌రారు చేసారు. దీంతో..ఇప్పుడు వైసిపి నుండి ముగ్గురు ప్ర‌ధాన క్యాంపెయిన‌ర్లు ప్ర‌చారం లోకి దిగారు. ఇక‌, ఇప్పుడు ష‌ర్మిళ లోకేశ్..జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాన్ పై ఎటువంటి వాగ్బాణాలు సంధిస్తార‌నేది ఆస‌క్తి క‌రంగా మారుతోంది.

English summary
YCp Chief Jagan Mother Vijayamma and sister Sharmila started their election campaign in support of YCP candidates. Sharmila starting from Mangalagiri and Vijayamma From Prakasam dist.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X