వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవన్ కళ్యాణ్‌ను ఏకిపారేసిన షర్మిల (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: బిజెపి-టిడిపి కూటమి తరపున ఎన్నికల ప్రచారంలో జనసేన అధినేత, సినీహీరో పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలను వైయస్సార్ కాంగ్రెస్‌ పార్టీ నాయకురాలు వైఎస్‌ షర్మిల ఏకిపారేశారు. పవన్‌ కళ్యాణ్‌ పేరుకు తగినట్లే గాలి మాటలు, సొల్లు కబుర్లు చెబుతున్నారని మండిపడ్డారు. రోజుకో మాట, పూటకో బాట పడుతున్న తలతిక్క పవన్‌కు తగిన బుద్ధి చెప్పాలని ఓటర్లకు షర్మిల పిలుపు ఇచ్చారు.

పవన్‌ కళ్యాణ్‌ మాటలు తన అభిమానులకే అర్ధంకావడంలేదని చెప్పారు. 2009 ఎన్నికల్లో చంద్రబాబును అవినీతి పరుడని తిట్టిన పవన్‌ ఇప్పుడు ఆయకే ఓటు వేయమని చెబుతున్నారని షర్మిల అన్నారు. పవన్‌ కళ్యాణ్‌కున్న విశ్వసనీయత అది అన్నారు. పవన్ కళ్యాణ్ విభజనవాదులతో కలిసి డ్యూయట్లు పాడుతున్నారని, చిందులు వేస్తూ ఫోటోలకు ఫోజులిస్తున్నారని విమర్శించారు. పవన్‌ కళ్యాణ్‌కు పిచ్చివాడికి తేడా లేదని చెప్పారు.

"మీ ఊరికి పిచ్చోడు వచ్చి ఒక సెంటర్‌లో నిలబడి పిచ్చిపిచ్చిగా మాట్లాడితే ఆ పిచ్చిమనిషి చెప్పినట్లు వింటారా? ఆ పిచ్చిమనిషి చెప్పినవారికి ఓట్లు వేస్తారా? ఆ పిచ్చోడికి పవన్‌ కల్యాణ్‌కు తేడా లేదు. ఆయన మొదట ఒక ఆడిటోరియం తీసుకొని పెద్ద సభ పెట్టాడు. జనసేన అనే పార్టీ పెట్టానని ఆర్భాటంగా ప్రకటించాడు. ప్రస్తుతం పోటీ చేయడం లేదు, మీ ఇష్టమొచ్చిన వారికి ఆత్మసాక్షిగా ఓట్లు వేసుకోండని చెప్పాడు. వారం రోజు లు కూడా తిరక్కుండానే... లేదు, లేదు నేను మోడీని కలిసొచ్చాను... మీరంతా మోడీకి ఓట్లే యండని చెప్పాడు" అని షర్మిల అన్నారు.

మొగుడు పెళ్లాల మాదిరిగా..

మొగుడు పెళ్లాల మాదిరిగా..

పవన్‌ కళ్యాణ్‌, చంద్రబాబు తమ ఎన్నికల ప్రచారంలో కొత్త గా పెళ్లయిన మొగుడు పెళ్లాల మాదిరిగా ఒకరి గురించి ఒకరు గొప్పలు చెప్పుకుంటున్నారని షర్మిల అన్నారు.

చంద్రబాబు ఊసరవెల్లి

చంద్రబాబు ఊసరవెల్లి

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చచంద్రబాబు ఊసర వెల్లికంటే వేగంగా రంగులు మారుస్తారని షర్మిల ఓటర్లను హెచ్చరించారు.

అప్పుడు అలా, ఇప్పుడు ఇలా..

అప్పుడు అలా, ఇప్పుడు ఇలా..

దివవంగత మహానేత వైఎస్‌ రాజశేఖర రెడ్డిని ఎదుర్కోలేక గతంలో మహా కూటమి అన్న చంద్రబాబు, ఇప్పుడు ఆయన తనయుడు జగనన్నను ఎదుర్కొనేందుకు గుజరాత్‌ నుంచి నరేంద్ర మోడీని తెచ్చుకున్నారని షర్మిల విమర్శించారు.

బాబు పవన్ కాళ్లు పట్టుకున్నారు

బాబు పవన్ కాళ్లు పట్టుకున్నారు

నరేంద్ర మోడీ చాలక నారా చంద్రబాబు నాయుడు పవన్‌ కళ్యాణ్‌ కాళ్లు పట్టుకున్నారని షర్మిల తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

తల్లి కోసం ఇలా..

తల్లి కోసం ఇలా..

విశాఖపట్నం లోకసభ స్థానం నుంచి పోటీ చేస్తున్న తన తల్లి వైయస్ విజయమ్మ కోసం షర్మిల సోమవారం ఆ నియోజకవర్గంలో ప్రచారం చేశారు.

ఫ్యాన్స్‌కే అర్థం కావడం లేదు..

ఫ్యాన్స్‌కే అర్థం కావడం లేదు..

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆయన అభిమానులకే అర్థం కావడం లేదని వైయస్ షర్మిల విరుచుకుపడ్డారు.

పవన్ కళ్యాణ్ పిచ్చోడిలా..

పవన్ కళ్యాణ్ పిచ్చోడిలా..

పవన్ కళ్యాణ్ పిచ్చోడి మాదిరిగా వ్యవహరిస్తున్నారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు వైయస్ షర్మిల వ్యాఖ్యానించారు.

English summary

 YSR Congress party president YS Jagan's sister YS Sarmila comapigning for her mother in Visakhapatnam Loksabha segment retaliated Jana Sena chief Pawan Kalyan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X