బాలకృష్ణ పనికి రాలేదని పవన్ కాళ్లు: బాబుపై షర్మిల
రాజమండ్రి: టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పైన, హీరో నందమూరి బాలకృష్ణ, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పైన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మహిళా నాయకురాలు షర్మిల ఆదివారం దుమ్మెత్తి పోశారు. ఆమె తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
స్వర్గీయ నందమూరి తారక రామారావు అభిమానులు చంద్రబాబును ఎట్టి పరిస్థితుల్లోను క్షమించకూడదన్నారు. బాబు ఆయన పైన చెప్పులు వేయించారని ఆరోపించారు. వైయస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు చంద్రబాబు ఆయనను ఒంటరిగా ఎదుర్కోలేకపోయారని, కనీసం ఆయన కొడుకు జగన్‌ను కూడా ఎదుర్కోలేకపోతున్నారన్నారు.

వెంకయ్యను, మోడీని, చివరకు పవన్ కళ్యాణ్‌ను కూడా తీసుకు వచ్చారన్నారు. అధికారం కోసం పవన్ కళ్యాణ్ కాళ్లు పట్టుకున్నారని ధ్వజమెత్తారు.
చంద్రబాబు ఏం చెబితే ఆయన బావమరిది బాలకృష్ణ అది చేస్తారన్నారు. చంద్రబాబు ఎక్కడ మీసం మెలేయమంటే అక్కడ, ఎప్పుడు తొడ గొట్టమంటే ఎక్కడ, చివరకు ఏ డైలాగ్ చెప్పమంటే ఆ డైలాగ్ చెబుతారని, ఆయనతో హనీమూన్ వెళ్తారని ఎద్దేవా చేశారు. బాలకృష్ణ అంత చేస్తే బాబు దృష్టిలో అది పనికి రాలేదని, ప్రచారం కోసం పవన్‌ను ఉపయోగించుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
సొంత ఇంట్లో సొంత తుపాకీతో సొంత నిర్మాతను కాల్చిన బాలకృష్ణ మతిస్థిమితం లేని వాడో తెలియదన్నారు. పవవ్‌కు విలువలు, విశ్వసనీయత లేదని ఉన్నదంతా లెక్కలేనంత తిక్కే అన్నారు. ఆయన తిక్క చేష్టలు మాటలు, చేతల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు. పిఆర్పీ నేతగా 2009లో బాబును అవినీతి చక్రవర్తికి ఓటేయవద్దని చెప్పి ఇప్పుడు ఆయనకు మద్దతు ఎలా పలుకుతున్నారన్నారు.












Click it and Unblock the Notifications