హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కుక్క ఇంజెక్షన్‌తో జయరాం హత్య!: నాతో లైంగిక సంబంధం.. విల్లాకు వచ్చేవాడు: శిఖా చౌదరి

|
Google Oneindia TeluguNews

అమరావతి: ఎక్స్‌ప్రెస్ టీవీ యజమాని, కోస్టల్ బ్యాంకు డైరెక్టర్ చిగురుపాటి జయరాం హత్య కేసులో ఆసక్తికర అంశాలు వెలుగు చూస్తున్నాయి. పోలీసుల విచారణలో ఆయన మేనకోడలు శిఖాచౌదరి సంచలన విషయాలు వెల్లడించినట్లుగా మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. రాకేష్ రెడ్డిని అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. అతనిని ఓ గెస్ట్ హౌస్‌లో విచారించారని సమాచారం.

వత్సవాయి పోలీస్ స్టేషన్‌లో ఓ మహిళతో పాటు మరో ఇద్దరిని కూడా విచారిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. శిఖాచౌదరితో పాటు మరో మహిళ కూడా విచారణను ఎదుర్కొంటోందని అంటున్నారు. దీంతో ఆ మహిళ ఎవరు అనే చర్చ సాగుతోంది. ఆమె గతంలో జయరాం వద్ద పని చేసిన వారు అయి ఉంటారని అంటున్నారు.

 కుక్కలకు ఇచ్చే ఇంజెక్షన్ ఇచ్చి చంపేశారు

కుక్కలకు ఇచ్చే ఇంజెక్షన్ ఇచ్చి చంపేశారు

జయరాం హత్యకు ప్రధానంగా ఆర్థిక లావాదేవీలే కారణమని చెబుతున్నారు. నిందితులు జయరాంను దారుణంగా హత్య చేసినట్లుగా పోలీసులు గుర్తించారని తెలుస్తోంది. అతని హత్య హైదరాబాదులోనే జరిగినట్లుగా గుర్తించారని సమాచారం. కుక్కలను చంపడానికి ఉపయోగించే ఇంజెక్షన్‌ ఇచ్చి జయరాంను హత్య చేసినట్లు గుర్తించారు. ఇంజెక్షన్‌ ప్రభావంతో 10 నిమిషాల్లోనే ఆయన శరీరం విషపూరితమైనట్లుగా గుర్తించారని తెలుస్తోంది. మృతదేహం గుర్తించడానికి ఇరవై నాలుగు గంటల ముందే హత్య జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. కుక్కలను చంపేందుకు ఇథునేషియా అనే విషపూరిత ఇంజెక్షన్ వాడుతారు. జబ్బు సోకిన కుక్కల్ని చంపేందుకు ఉపయోగిస్తారు. ఇథునేషియా ఇంజెక్షన్ ఇచ్చాక మత్తులోకి వెళ్లి కుక్కలు చనిపోతాయట. శాంపిల్స్‌ను హైదరాబాద్ ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించారు.

కేసు బదలీ అయ్యే అవకాశం?

కేసు బదలీ అయ్యే అవకాశం?

ఈ హత్య కేసులో జయరాం మేనకోడలు శిఖా చౌదరి, ఆమె మిత్రుడు రాకేష్ రెడ్డితో పాటు పోలీసులు పలువురిని ప్రశ్నిస్తున్నారు. జయరాం హత్య, ఆర్థిక వివాదాలు, నగదు బదిలీ హైదరాబాద్‌లోనే జరిగినట్లుగా గుర్తించినట్లుగా తెలుస్తోంది. ఈ కేసు కృష్ణా జిల్లా నుంచి హైదరాబాద్‌ బదిలీ అయ్యే అవకాశముందని అంటున్నారు.

నా చెల్లి దూరంగా ఉంటోంది

నా చెల్లి దూరంగా ఉంటోంది

ఇదిలా ఉండగా, పోలీసుల విచారణలో శిఖా చౌదరి సంచలన విషయాలు వెల్లడించినట్లుగా వార్తలు వస్తున్నాయి. మీడియాలో వస్తున్న వార్తల మేరకు... తన మామయ్య జయరాం వ్యక్తిగతంగా మంచివాడు కాదని తెలిపింది. తనను, తన చెల్లిని ఆయన లైంగికంగా వేధించాడని చెప్పింది. తన చెల్లికి మామయ్యనే మెడికల్ సీటు ఇప్పించాడని చెప్పింది. ఆయన వేధింపులు తట్టుకోలేక తన చెల్లి చాలా దూరంగా ఉంటోందని చెప్పింది. తాను మేనకోడలిని అయినప్పటికీ తనతో శారీరక సుఖం కోరుకునేవాడని ఆమె చెప్పింది. ఇదంతా తన వ్యక్తిగత జీవితం అని చెప్పింది. తనకు నచ్చింది కాబట్టి ఒప్పుకున్నానని కూడా చెప్పిందట.

 నా విల్లాకు రావడంపై రాకేష్ అభ్యంతరం

నా విల్లాకు రావడంపై రాకేష్ అభ్యంతరం

తనకు రెండు పెళ్లిళ్లు అయ్యాయని, రెండో భర్తతో బ్రేకప్ తర్వాత రాకేష్ రెడ్డిని పెళ్లి చేసుకోవాలని భావించానని ఆమె చెప్పింది. రాకేష్‌తో డేటింగ్ కారణంగా రెండో భర్తను వదులుకోవాల్సి వచ్చిందని చెప్పింది. తన మామయ్య తనతో లైంగిక సంబంధం పెట్టుకున్నట్లుగా కూడా చెప్పినట్లుగా తెలుస్తోంది. జయరాం తరుచూ నా విల్లాకు రావడంపై రాకేష్ అభ్యంతరం చెప్పాడని చెప్పినట్లుగా తెలుస్తోంది. తన విల్లాకు ఓ సందర్భంలో ఇరువురు వచ్చి గొడవ పెట్టుకున్నట్లుగా చెప్పినట్లుగా తెలుస్తోంది. ఆ తర్వాత తాను రాకేష్‌కు దూరంగా ఉంటున్నట్లుగా చెప్పింది. రాకేష్‌తో గొడవలు జరుగుతున్న సమయంలో శ్రీకాంత్‌తో పరిచయమైనట్లు చెప్పింది.

 అప్పుడే ఆర్థిక ఇబ్బందులు

అప్పుడే ఆర్థిక ఇబ్బందులు

తన చెల్లికి మామయ్య అంటేనే చిరాకు అని కూడా చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి. తన చెల్లిని కూడా కోరుకున్నాడని, అందుకే ఆమెకు నచ్చదని చెప్పినట్లుగా తెలుస్తోంది. తాను అంటే ఎంతో ఇష్టం కాబట్టి తనను పలు కంపెనీలకు డైరెక్టర్లుగా చేశాడని చెప్పిందట. ఎప్పుడైతే చెక్ పవర్ అత్త వద్దకు వెళ్లిపోయిందో అప్పుడు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నాడని చెప్పిందట. అయితే, ఆమె చెప్పిన విషయాలను పోలీసులు కూడా నిర్ధారించుకోవాల్సి ఉందని అంటున్నారు. కేసు నుంచి తప్పించుకోవడానికి అలా చెప్పిందా అనేది కూడా తెలియాల్సి ఉందని అంటున్నారు.

English summary
Police investigating the murder of Telugu businessman Jayaram Chigurupati, who was found dead in his car under suspicious circumstances in Nandigama in AP two days back, have taken his niece and her friend into custody for questioning.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X