వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇక ఆయనిష్టం: శిల్పా మోహన్ రెడ్డి, చక్రపాణి ప్లాన్, అఖిలప్రియ వైపే చేయి

తాను తన సోదరుడు, టిడిపి ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణి రెడ్డిని తమ పార్టీలో చేరమని అడిగానని వైసిపి నంద్యాల ఉప ఎన్నిక అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి సోమవారం చెప్పారు.

|
Google Oneindia TeluguNews

నంద్యాల: తాను తన సోదరుడు, టిడిపి ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణి రెడ్డిని తమ పార్టీలో చేరమని అడిగానని వైసిపి నంద్యాల ఉప ఎన్నిక అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి సోమవారం చెప్పారు.

సాక్షి పత్రిక ప్రింటింగ్ ఖర్చు శిల్పా లెక్కలోకి: వైసిపికి 'టిడిపి' షాక్సాక్షి పత్రిక ప్రింటింగ్ ఖర్చు శిల్పా లెక్కలోకి: వైసిపికి 'టిడిపి' షాక్

అన్నదమ్ములు వేర్వేరు పార్టీలలో ఎందుకు అని తాను అడిగానని చెప్పారు. అయితే, తనకు కొంత సమయం ఇస్తే ఆలోచిస్తానని చెప్పాడని మోహన్ రెడ్డి తెలిపారు.

చెరో దిక్కు సరికాదు

చెరో దిక్కు సరికాదు

తమ కుటుంబానికి పెద్ద అయినా నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నానని, అందుకే కుటుంబ సభ్యుడిగా తమ్ముడు చక్రపాణి రెడ్డి మద్దతు కోరినట్లు శిల్పా మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. అన్నదమ్ములం కాబట్టి ఒక్కొక్కరు వేర్వేరు దిక్కుల్లో ఉండటం సరికాదన్నది తన అభిప్రాయమన్నారు.

Recommended Video

Chandrababu Fires On TDP Leaders Over YS Jagan Matter | Oneindia Telugu
ఆ వార్డులోనే.. అందుకే కలిశా, ఆయన ఇష్టం

ఆ వార్డులోనే.. అందుకే కలిశా, ఆయన ఇష్టం

తమ్ముడు నివసిస్తున్న వార్డులో పర్యటిస్తున్నానని, ఇందులో భాగంగా కలవడం ధర్మం కాబట్టి కలిశానని చెప్పుకొచ్చారు. ఎన్నికల్లో తమ్ముడి సహకారం కోరానని వివరించారు. ఇక తమ్ముడి ఇష్టంపై మద్దతు ఆధారపడి ఉంటుందన్నారు. అంతకు మించి మా ఇద్దరి భేటీలో ప్రత్యేకమైన విశేషాలు లేవన్నారు. వైసిపిలో చేరిన తర్వాత కలవడం ఇదే మొదటిసారి అన్నారు. ఎన్నికల్లో మద్దతు మాత్రమే కాదని, అవసరమైతే వైసిపిలోకి రమ్మని కూడా కోరుతున్నానని చెప్పారు.

అంతా అఖిలప్రియ వల్లే

అంతా అఖిలప్రియ వల్లే

కాగా, తాను టిడిపిలో కొనసాగుతున్నప్పటికీ సరైన ప్రాధాన్యం ఇవ్వడం లేదని చక్రపాణి పరోక్షంగా అఖిలప్రియపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన అసంతృప్తి అధిష్టానం కంటే అఖిలప్రియ పైనే ఉందంటున్నారు. ఉప ఎన్నికల ప్రచారంలో ఆయనను అఖిలప్రియ దూరంగా ఉంచుతున్నారని, దీంతో ఆయన మనస్తాపం చెందారని అంటున్నారు.

బుజ్జగింపులు చేసినా..

బుజ్జగింపులు చేసినా..

దీంతో టిడిపి నేతలు రంగంలోకి దిగారు. ఆయనకు బుజ్జగింపులు ప్రారంభించారు. వచ్చే ఎన్నికల్లో తనకు శ్రీశైలం నియోజకవర్గం టిక్కెట్ ఇస్తేనే టిడిపిలో ఉంటానని శిల్పా చక్రపాణి రెడ్డి పార్టీ నేతలకు స్పష్టం చేశారని తెలుస్తోంది. పక్కా హామీ ఉంటే తాను టిడిపిలోనే ఉంటానని చెప్పారని సమాచారం. కానీ, శిల్పా చక్రపాణి వైసిపిలోకి వెళ్లాలని దాదాపు నిర్ణయించుకున్నారని, అందులో భాగంగానే టిడిపికి షరతులు పెట్టడం, తాను కేవలం ఆహ్వానించానని తన సోదరుడి ఇష్టమని శిల్పా మోహన్ రెడ్డి అనడం వ్యూహంలో భాగమంటున్నారు.

English summary
Since the poll schedule for the Nandyal by-polls have been announced, the YSR Congress and TDP parties have intensified their campaign.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X