వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హీరో శివాజీ: ప్రత్యేక హోదా పోరును వదిలేసి, సినిమాల్లో విలన్ వేషాలు

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే వరకు విశ్రమించబోనంటూ ఆందోళనకు శ్రీకారం చుట్టిన తెలుగు సినీ నటుడు శివాజీ మళ్లీ సినిమాలపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఎపికి ప్రత్యేక హోదా కోసం ఆయన పలు ఆందోళనా కార్యక్రమాలు చేపట్టారు. దాంతో బిజెపి నాయకత్వం ఆగ్రహానికి కూడా గురయ్యారు.

అయితే, శివాజీ ఆ ఆందోళనలు చేపట్టడం వెనక ఓ ప్రముఖ తెలుగు టీవీ చానెల్ ఉందని పుకార్లు షికార్లు చేశాయి. అయితే, ఆయన పోరాటానికి రాజకీయ పార్టీల నుంచి పెద్దగా మద్దతు లభించలేదు. దాంతో క్రమంగా ఆయన ఆ ఆందోళన నుంచి వెనక్కి తగ్గినట్లున్నారు.

చిరు, పవన్ పార్ట్‌టైమర్స్: కిరణ్ రెడ్డి సహా మిగతా వారేమయ్యారు? (పిక్చర్స్)చిరు, పవన్ పార్ట్‌టైమర్స్: కిరణ్ రెడ్డి సహా మిగతా వారేమయ్యారు? (పిక్చర్స్)

రాజకీయాలపై వైరాగ్యంతో ఆయన తిరిగి సినిమాలపై దృష్టి పెట్టినట్లు చెబుతున్నారు. ఆయన చేసిన మూడు సినిమాలు ఇప్పటికీ ఆగిపోయాయని సమాచారం. వాటిని కొనేవాళ్లు లేక ల్యాబ్‌లో మురిగిపోతున్నాయని చెబుతున్నారు. దీంతో సినిమాలో ఆయన రూట్ మార్చి విలన్ వేషాలకు సిద్ధపడుతున్నట్లు చెబుతున్నారు.

 Shivaji leaves fight for special status and negative roles in Films

తన సన్నిహిత మిత్రుడు, నిర్మాత వేణుగోపాల్ సలహా మేరకు రెండు మూడు సినిమాల్లో శివాజీ విలన్‌గా నటించాడని సమాచారం. చిరంజీవి హీరోగా నటించిన ఇంద్రలో నెగెటివ్ టచ్ ఉన్న పాత్ర వేశాడు. కానీ హీరోగా మారే ఉద్దేశంతో మిస్సమ్మ సినిమా చేశాడు. ఆ సినిమా బాగా ఆడినప్పటికీ శివాజీకి పెద్దగా హీరో పాత్రలురాలేదు.

తాజాగా, షీ అనే సినిమాలో ఓ పాత్ర పోషిస్తున్నాడు. త్వరలో విలన్ వేషాలు వేయడానికి సిద్ధపడినట్లు తెలుస్తోంది. శివాజీ కోసమే కొన్ని పాత్రలు డిజైన్ చేసి, విలన్‌గా చూపిస్తానని నిర్మాత వేణుగోపాల్ అంటున్నారు.

English summary
It is said that actor Shivaji abandoned the fight for special status to Andhra Pradesh, has prepared to act in negative roles in Telugu films.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X