సానియా ఇంట్లో లయన్స్‌కి షోయబ్ బిర్యానీ విందు..!

హైదరాబాద్: టెన్నిస్ స్టార్ సానియా మీర్జాతో వివాహం తర్వాత పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ హైదరాబాద్‌లో అడుగుపెట్టాడు. సానియా మిర్జా లేకున్నా సానియా నివాసంలో జట్టు సహచరులకు ఆమె కుటుంబ సభ్యులు లాహోర్ లయన్స్ కెప్టెన్ మహ్మద్ హఫీజ్‌తో పాటు ఇతర ఆటగాళ్లకు హైదరాబాదీ బిర్యానీని రుచి చూపించారు.

ఛాంపియన్స్ లీగ్ టి20 టోర్నమెంట్ సందర్భంగా పాక్ దేశవాళీ జట్టు లాహోర్ లయన్స్ మ్యాచ్ కోసం హైదరాబాద్ వచ్చింది. భార్య సానియా మీర్జా స్వస్థలం హైదరాబాదే కావడంతో షోయబ్ మాలిక్ తన టీం మెంబర్స్‌కు మంచి విందు ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. వారిని సంతృప్తి పరచడానికి హైదరాబాదీ బిర్యానీని వడ్డించాడు.

Shoaib Malik Treats Lahore Lions to Biryani at Sania Mirza's Place

ఈ విందులో తన సహచర క్రికెటర్లుకు ఏ లోటు రాకుండా దగ్గరుండి మరీ చూసుకున్నాడట. ఈ విందు సమయంలో సానియా మిర్జా హైదరాబాద్‌లో లేదు. టోక్యో ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో ఆడేందుకు సానియా విదేశాలకు వెళ్లింది.

ఛాంపియన్స్ లీగ్‌లో లాహోర్ లయన్స్ క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో సదరన్ ఎక్స్‌ప్రెస్ ఘన విజయం సాధించింది. నార్తర్న్ డిస్ట్రిక్ట్స్ చేతిలో ముంబై ఇండియన్స్ ఓడిపోవడంతో, రెండు విజయాలు సాధించి 8 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచిన లాహోర్ లయన్స్ ప్రధాన టోర్నమెంట్‌కు అర్హత సాధించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+