శోభమ్మ వర్ధంతిలో జగన్, విజయమ్మ(ఫోటోలు)
హైదరాబాద్: దివంగత నేత, మాజీ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి ప్రథమ వర్ధంతిని కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలోని శోభాఘాట్ వద్ద శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్, వైయస్ విజయమ్మతో పాటు భారీ సంఖ్యలో పార్టీ శ్రేణులు, అభిమానులు హాజరయ్యారు.
ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా తయారు చేయించిన శోభా నాగిరెడ్డి విగ్రహాలు రెండింటిని వైఎస్ జగన్, పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మలు ఆవిష్కరించారు. దీంతో పాటు శోభానాగిరెడ్డిపై రచించిన పాటల సీడీని కూడా జగన్ ఆవిష్కరించారు.

షర్మిల అనే చెల్లె, శోభమ్మ అనే అక్క: జగన్

ఈ వర్ధంతి సభలో వైయస్ జగన్ మాట్లాడుతూ ఎండలను సైతం లెక్కచేయకుండా ఎంతోమంది ఇక్కడకు వచ్చారని అన్నారు. అభిమానం ఉంటే దేనినీ ఖాతరు చేయరని, సమస్యలను లెక్కపెట్టరని ఇక్కడికొచ్చిన అభిమానుల్ని చూస్తే అర్థమవుతోందని చెప్పారు. భూమా కుటుంబానికి మేమందరం తోడుగా ఉన్నామని ఇక్కడికొచ్చిన ప్రతి గొంతు చెబుతోందని తెలిపారు.

షర్మిల అనే చెల్లె, శోభమ్మ అనే అక్క: జగన్
ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియకు 65 మంది వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలం మేనమామలుగా తోడుగా ఉంటామని చెప్పారు. శోభమ్మను ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించారంటే ఆమెపై ఎంత అభిమానం ఉందో ఇట్టే అర్థమవుతుందని అన్నారు.

షర్మిల అనే చెల్లె, శోభమ్మ అనే అక్క: జగన్
మంచి ఎమ్మెల్యేలు కొందరే ఉంటారు. అలాంటి వారిలో శోభానాగిరెడ్డి ఒకరని అని వైయస్ జగన్ కొనియాడారు. జగన్ మీద ఈగ వాలనీయకుండా శోభమ్మ చూసిందన్న సాయన్న మాటల్లో నిజముందన్నారు. ‘నాకు షర్మిల అనే ఒక చెల్లెలు ఉంది.. శోభమ్మ అనే అక్క కూడా ఉంది' అని గద్గద స్వరంతో అన్నారు.

Click it and Unblock the Notifications