ధర్మాన బ్రదర్స్‌కి, బొత్సకు టిడిపి షాక్: జగన్ పార్టీ దాడి

ధర్మాన ప్రసాద రావు నియోజకర్గం శ్రీకాకుళంలోని టిడిపి ముందంజలో ఉంది. ధర్మాన స్వగ్రామంలో ముబుగాం ఎంపీటీసీని టిడిపి దక్కించుకుంది. పిసిసి మాజీ చీఫ్ బొత్స సత్యనారాయణ నియోజకవర్గం చీపురుపల్లిలో టిడిపి ముందంజలో ఉంది.
ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద ఉద్రిక్తత
హైదరాబాదు శివారులోని రంగారెడ్డి జిల్లా ఘట్‌కేసర్‌లో ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద గుంపులు గుంపులుగా ఉన్న కార్యకర్తలను చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నించారు. దీంతో ఆగ్రహం చెందిన కార్యకర్తలు పోలీసులపై ఎదురుదాడికి దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది.
టిడిపి కార్యకర్తలపై దాడి
గుంటూరు జిల్లా నరసారావుపేట మండలం అల్లూరుపాలెంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు టిడిపి కార్యకర్తకు చెందిన హోటల్‌ను తగులబెట్టారు. ఈ దాడిలో ఇద్దరు టిడిపి కార్యకర్తలకు గాయాలయ్యాయి. మరోవైపు కడప జిల్లా సిద్దవటం మండలం బేగనవాండ్లపల్లె గ్రామానికి చెందిన జగన్ పార్టీ కార్యకర్తలు లింగంపల్లె గ్రామానికి చెందిన టిడిపి నేతల పైన కర్రలతో దాడి చేశారు. టక్కోలు ఎంపిటిసి స్థానాన్ని తాము కైవసం చేసుకోవడాన్ని జీర్ణించుకోలేకనే ఈ దాడికి పాల్పడ్డారని టిడిపి వర్గాలు అంటున్నాయి.












Click it and Unblock the Notifications