నటుడు పృథ్వీరాజ్ కు షాక్.. ఆ కేసులో నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ

నటుడు పృథ్వీరాజ్ కు విజయవాడ కోర్టు ఊహించని షాక్ ఇచ్చింది. 30 ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ సినిమా ఇండస్ట్రీలో తనకు ఒక గుర్తింపు తెచ్చుకున్న నటుడు పృథ్వీరాజ్ కు విజయవాడ ఫ్యామిలీ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. కొన్నేళ్ల క్రితం పృథ్వీరాజ్ తన భార్య శ్రీలక్ష్మి తో విడిపోయాడు. ఈ సమయంలో కోర్టు తన భార్యకు ప్రతినెల భరణం చెల్లించాలని పృథ్వీరాజ్ ను ఆదేశించింది

భార్యకు భరణం చెల్లించని పృధ్వీ రాజ్
నటుడు పృథ్వీరాజ్ ప్రతి నెల భార్యకు ఎనిమిది లక్షల రూపాయలను భరణంగా చెల్లించవలసి ఉంది. అయితే కొంతకాలంగా పృథ్వీరాజ్ నెల నెలా భరణాన్ని చెల్లించకపోవడంతో విజయవాడ కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ ను జారీ చేసింది. నటుడు పృథ్వీరాజ్ విషయానికి వస్తే 1984లో ఆయన శ్రీ లక్ష్మీ అనే మహిళను వివాహం చేసుకున్నారు. వారికి ఒక కుమారుడు. కుమార్తె కూడా ఉన్నారు.

Shock for actor Prudhviraj Non-bailable arrest warrant issued in that case

విజయవాడ ఫ్యామిలీ కోర్టులో కేసు వేసిన పృధ్వీ రాజ్ భార్య
ఆ తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో భార్యాభర్తలిద్దరూ విడాకులు తీసుకుని వేరువేరుగా ఉంటున్నారు. అయితే విడాకుల సమయంలో పృథ్వీరాజ్ భార్య పిల్లలకు మనోవర్తి చెల్లించాలంటూ ఆదేశాలు జారీ చేసిన ఆయన చెల్లించకపోవడంతో మళ్లీ భార్య శ్రీలక్ష్మి విజయవాడ స్థానిక ఫ్యామిలీ కోర్టులో పృథ్వీరాజ్ పై కేసు వేసింది.

నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసిన ఫ్యామిలీ కోర్టు
ఇక కోర్టుకు హాజరు కావాలని నోటీసులు జారీచేసినా, ఆయన కోర్టుకు కూడా హాజరు కాకపోవడంతో స్థానిక ఫ్యామిలీ కోర్టు ఆయనకు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ ను జారీ చేస్తూ తక్షణం అరెస్టు చేయాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాలను పట్టించుకోక పోవడంతో పాటు భార్యకు ఇవ్వవలసిన భరణం ఇవ్వకపోగా, కోర్టుకు కూడా హాజరు కాకపోవడంతో కోర్టు ఆయన పైన నాన్ వెలబుల్ అరెస్ట్ వారెంట్ ను జారీ చేసినట్టు సమాచారం.

30 ఇయర్స్ ఇండస్ట్రీ డైలాగ్ తో పాపులర్
ఇదిలా ఉంటే తాడేపల్లిగూడెంలో జన్మించిన పృథ్వీరాజ్ 1992లో రాజేంద్రప్రసాద్ నటించిన ఆ ఒక్కటి అడక్కు సినిమాతో సినిమాలలోకి ప్రవేశించారు. దాదాపు 100 సినిమాలలో నటించిన ఆయన కృష్ణవంశీ ఖడ్గం సినిమాలో 30 ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ అనే డైలాగ్ తో బాగా పాపులర్ అయ్యారు.

రాజకీయాల్లోనూ పృధ్వీ రాజ్
2018లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి 2019లో వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ చైర్మన్ గా నామినేట్ అయ్యారు. ఆ తర్వాత పలు ఆరోపణలతో ఆ పదవిని వదిలివేయవలసి వచ్చింది. ఆపై 2024లో జనసేన పార్టీలో చేరి పవన్ కళ్యాణ్ కు తన మద్దతును ప్రకటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+