చంద్రబాబుకు షాక్ ... సైకో చంద్రబాబు గో బ్యాక్.. పీలేరు పర్యటన వేళ ఫ్లెక్సీలు!!
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈరోజు పీలేరు సబ్ జైల్లో ఉన్న టిడిపి కార్యకర్తలను పరామర్శించడానికి వెళ్ళనున్నారు. ఈ క్రమంలో చంద్రబాబునాయుడు కి షాక్ ఇస్తూ పీలేరులో ఫ్లెక్సీలు వెలిశాయి. ఆగంతకులు పెట్టిన ఆ పోస్టర్లలో టీడీపీ నేతలు, కార్యకర్తలే దాడులకు పాల్పడుతున్నారని ఎదురు దాడి చేశారు. సైకో చంద్రబాబు గో బ్యాక్, చంద్రబాబు గో బ్యాక్, పుంగనూరులో మత కలహాలు సృష్టిస్తున్న చంద్రబాబు గో బ్యాక్ అంటూ పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు వెలిశాయి.

టీడీపీ గూండాలు దాడులు చేస్తే చూస్తూ ఊరుకోవాలా?
తెలుగుదేశం పార్టీ గుండాలు గొడవలు చేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా? వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై తెలుగుదేశం పార్టీ గుండాలు చేస్తున్న దాడులను సహించాలా? అని ప్రశ్నిస్తూ కొన్ని ఫోటోలను జోడించి పెద్ద ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. నేడు చంద్రబాబు పర్యటన నేపథ్యంలో అన్నమయ్య జిల్లా పీలేరులో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలతో టెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది. పీలేరు రైల్వే ట్రాక్ వద్ద ఈ ఫ్లెక్సీలను గుర్తుతెలియని వ్యక్తులు ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు. అయితే ఇది వైసిపి పనేనని టిడిపి నేతలు చెబుతున్నారు.

పీలేరు లో టెన్షన్... బ్యానర్లతో కలకలం
పీలేరు సబ్ జైలుకు చంద్రబాబు నాయుడు కార్యకర్తలను పరామర్శించడానికి వెళుతున్న వేళ ఏర్పాటు చేసిన ఈ బ్యానర్లు హాట్ టాపిక్ గా మారాయి. కాగా ఈనెల 7వ తేదీన రొంపిచర్లలో చల్లా బాబు ఫ్లెక్సీలను చింపడానికి ప్రయత్నం చేసిన వైసిపి కార్యకర్తలను, టిడిపి శ్రేణులు అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారు. దీంతో టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య వివాదం చోటు చేసుకోగా, టిడిపి శ్రేణులు హత్యాయత్నం చేశారని, వారిపై హత్యాయత్నం సెక్షన్లతో సహా పలు సెక్షన్లలో కేసులు నమోదు చేశారు.

నేడు టీడీపీ కార్యకర్తలను పరామర్శించనున్న చంద్రబాబు
ఈ ఘటనలో ఎనిమిది మంది టిడిపి కార్యకర్తలను పదవ తేదీన అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే ఇదంతా వైసిపి కక్షపూరితంగా పెడుతున్న తప్పుడు కేసులని తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే టిడిపి అధినేత చంద్రబాబు పీలేరు సబ్ జైల్లో ఉన్న టిడిపి కార్యకర్తలను పరామర్శించి, వారికి భరోసా ఇవ్వనున్నారు.












Click it and Unblock the Notifications