జేసీ ప్రభాకర్ రెడ్డికి షాక్: ఆయనతో పాటు టీడీపీకి చెందిన 120మందిపై కేసు నమోదు!!
తాడిపత్రిలో రాజకీయం రసవత్తరంగా మారింది. అధికార ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం ఆందోళన వరకు, చివరకు కేసు నమోదు చేసే వరకు వెళ్లింది. తాజాగా టిడిపి నేత తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనతోపాటు మరో 120 మంది టీడీపీ నాయకులపై కూడా పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇంతకీ ఏం జరిగిందంటే

తాడిపత్రిలో టీడీపీ కౌన్సిలర్లపై దాడులు .. జేసీ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా
తాడిపత్రిలో టిడిపి కౌన్సిలర్ల పై వరుస దాడులను మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి, మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు తీవ్రంగా ఖండించారు. నిన్న తాడిపత్రి పోలీస్ స్టేషన్ ఎదుట జేసీ ప్రభాకర్ రెడ్డి బైఠాయించి ఆందోళనకు దిగారు జేసీ ప్రభాకర్ రెడ్డి. వైసిపి ఆగడాలకు పోలీసులు వత్తాసు పలుకుతున్నారు అంటూ పోలీసులకు వ్యతిరేకంగా ధర్నా చేపట్టిన జేసీ ప్రభాకర్ రెడ్డి పోలీసులపై విరుచుకుపడ్డారు.

తాడిపత్రి పోలీస్ స్టేషన్ వద్ద హై టెన్షన్
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పై, స్థానిక ఎమ్మెల్యేలపై నిప్పులు చెరిగారు. తాడిపత్రిలో టిడిపి ప్రభుత్వం ఉన్ననాటి కంటే, ఇప్పుడే క్రైమ్ రేటు విపరీతంగా పెరిగిందని మండిపడ్డారు. వైసిపి పాలనలో శాంతిభద్రతల పరిరక్షణ లేకుండాపోయిందని విరుచుకుపడ్డారు. సేవ్ తాడిపత్రి, డిఎస్పి డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తెలుగుదేశం పార్టీ శ్రేణుల ఆందోళన నేపథ్యంలో తాడిపత్రి పోలీస్ స్టేషన్ వద్ద కొద్దిసేపు హైటెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది.

జేసీ ప్రభాకర్ రెడ్డి వర్సెస్ డీఎస్పీ చైతన్య
తాడిపత్రి డిఎస్పీ చైతన్య తీరు పై మండిపడిన జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయన తీవ్ర వాగ్వాదానికి దిగారు. పోలీసులు సర్దిచెప్పి, దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పడంతో జేసీ ప్రభాకర్ రెడ్డి ఆందోళనను విరమించారు. అయితే తాజాగా ఈ వ్యవహారంలో జేసీ ప్రభాకర్ రెడ్డిపై, ఆయన అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

జేసీ ప్రభాకర్ రెడ్డితో పాటు 120 మందిపై కేసులు నమోదు
పోలీసులు జేసీ ప్రభాకర్ రెడ్డికి షాక్ ఇచ్చారు. తాడిపత్రి పట్టణంలో 30 పోలీస్ యాక్ట్ అమలు లో ఉన్నప్పటికీ అనుమతులు లేకుండా టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట చట్టవిరుద్ధంగా నిరసన తెలిపారు అంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. ధర్నా చేసి, ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగించారని జేసీ ప్రభాకర్ రెడ్డి తో పాటు, మరో 120 మంది పై పలు సెక్షన్ల కింద కేసు తాడిపత్రి పోలీసులు కేసు నమోదు చేశారు.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications