చంద్రబాబు బూట్లు తుడుస్తా అన్నావ్.. ఏమైంది.. కొడాలి నాని వీడియోతో.. వదిలిపెట్టట్లేదుగా!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలలో వైసిపి ఘోర పరాజయం పాలైన తర్వాత ఏపీలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. 2024 సార్వత్రిక ఎన్నికలలో విజయం సాధించాలని వైసిపి టిడిపి కూటమి హోరాహోరీగా తలపడ్డాయి. కానీ ఎన్నికల ఫలితాలలో అనూహ్యంగా వైసిపి ఘోర ఓటమి పాలై 11 స్థానాలకు పరిమితమైంది. ఇక మరోవైపు తెలుగుదేశం కూటమి 164 స్థానాలతో విజయకేతనం ఎగురవేసింది.

కొడాలి నాని, వల్లభనేని వంశీల ఇళ్ళపై దాడులు
ప్రస్తుతం ఏపీలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. ఈ క్రమంలో ఏపీలో జరుగుతున్నటువంటి పరిణామాలు ప్రస్తుతం ఆసక్తికర చర్చకు కారణంగా మారాయి. గతంలో వైసిపి అధికారంలో ఉన్న సమయంలో నోటికి వచ్చినట్టు మాట్లాడిన మంత్రులను ఇప్పుడు టార్గెట్ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ప్రజలు ఇప్పటికే కొడాలి నాని ఇంటిమీద రాళ్లు, కోడిగుడ్లతో దాడిచేశారు. మరోవైపు వల్లభనేని వంశీ, అనిల్ కుమార్ యాదవ్ తదితరుల ఇళ్లపై దాడులకు పాల్పడుతున్నారు.

Shock for kodali nani tdp and chandrababu fans trollings on Kodali Nani with his video

కొడాలి నాని గతంలో చేసిన వ్యాఖ్యలు వైరల్
రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ జగన్ పేరుతో వేసిన శిలాఫలకాలను, మంత్రుల పేరుతో వేసిన శిలాఫలకాలను బద్దలు కొడుతున్నారు. ఇదే సమయంలో తాజాగా గతంలో కొడాలినాని చేసిన వ్యాఖ్యలను సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. అధికారంలో ఉన్న సమయంలో కొడాలి నాని చంద్రబాబు కుప్పంలో ఓడిపోకపోతే నేను రాజకీయాలు వదిలేస్తా.. ఆడి బూట్లు తుడుస్తా.. కాళ్ళ దగ్గరే కూర్చుంటా అంటూ చేసిన వ్యాఖ్యలను ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు.

చంద్రబాబు బూట్లు తుడువు.. కొడాలి నానీకి సూచన
నాడు కొడాలి నాని మాట్లాడిన వీడియోను షేర్ చేస్తూ ఇప్పుడు చంద్రబాబు గెలిచాడు చంద్రబాబు బూట్లు తుడుస్తా .. కాళ్ళ దగ్గర కూర్చుంటా అని చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి కొడాలి నాని ఆ పని చేయాలంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ఇక ఈ పరిణామాలు వైసిపికి కొడాలి నానికి పెద్ద తలనొప్పిగా మారాయి.

మాట్లాడిన వాటికి భారీ మూల్యం చెల్లించుకుంటున్న కొడాలి నాని
అధికారంలో ఉన్నప్పుడు నోటికొచ్చినట్టు ఏది పడితే అది మాట్లాడిన ఫలితం ఇప్పుడు కొడాలి నాని ప్రజల నుంచి వ్యతిరేకత, ప్రతిఘటన రూపంలో ఎదుర్కొంటున్నారు. అప్పుడు మాట్లాడిన మాటలకు ఇప్పుడు మూల్యం చెల్లించుకోవలసిన పరిస్థితి వచ్చింది. ఏమైనా అప్పట్లో చంద్రబాబును మరీ పర్సనల్ గా టార్గెట్ చేసిన కొడాలి నాని, వల్లభనేని వంశీ, అనిల్ కుమార్ యాదవ్, రోజా లను సోషల్ మీడియాలో టిడిపి శ్రేణులు నెటిజెన్లు ఓ ఆట ఆడుకుంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+