హైకోర్టు, ఏసీబీ కోర్టులలో చంద్రబాబుకు షాక్: న్యాయవాది సిద్ధార్థ్ లుథ్రా సంచలన ట్వీట్!!
టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి Telugu Desam Party (TDP) జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు Chandrababu Naidu జ్యుడీషియల్ రిమాండ్ ని విజయవాడలోని ACB కోర్టు మరో రెండు రోజులపాటు పొడిగించింది. రాజమండ్రి సెంట్రల్ జైల్ నుంచి Chandrababu Naiduని ఈరోజు ACB court Judge BSV Himabindu ఎదుట వర్చువల్ గా హాజరుపరచారు. అంతకు ముందు ఆయనకి విధించిన 14 రోజుల judicial remand ఈ రోజు ముగిసింది.
స్కిల్ డెవలప్ మెంట్ పథకం కుంభకోణంలో తనపై కేసు రద్దు చేయాలని కోరుతూ చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన quash పిటీషన్ ను ఆంధ్ర ప్రదేశ్ హై కోర్టు కొట్టివేసింది. చంద్రబాబు నాయుడు, సిఐడీ తరఫున న్యాయవాదుల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాస్ రెడ్డి ఈ నిర్ణయం ప్రకటించారు. ఇటు హైకోర్టు లోను, ఏసీబీ కోర్టులోనూ చంద్రబాబుకు చుక్కెదురు కావడంతో దీనిపై టిడిపి సుప్రీంకోర్టును ఆశ్రయించటానికి రెడీ అయింది.

ఇదిలా ఉంటే చంద్రబాబును బెయిల్ పై బయటకు తీసుకురావడానికి, స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు కోసం చేస్తున్న ప్రముఖ న్యాయవాది సిద్ధార్థ్ లుథ్రా siddharth luthra మరో ఆసక్తికర ట్వీట్ చేశారు. హైకోర్టు, ఏసీబీ కోర్టు చంద్రబాబుకు వ్యతిరేకంగా తీర్పులు ఇచ్చిన నేపథ్యంలో.. ప్రతి రాత్రి తర్వాత తెల్లవారుతుంది. ప్రతి ఉదయం మన జీవితాల్లో వెలుగునిస్తుంది అని ఆయన పేర్కొన్నారు.
ఆశావహ దృక్పథంతో ముందుకు వెళ్లాలి అన్నది ఆయన చేసిన వ్యాఖ్యల్లో ప్రధానమైన ఉద్దేశం. గతంలో కూడా చంద్రబాబు బెయిల్ chandrababu bail పిటిషన్ విషయంలో చంద్రబాబును బయటకు తీసుకురావడం సాధ్యం కాకపోవడంతో సిద్ధార్థ్ లుథ్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. న్యాయం కనుచూపుమేరలో లేదని తెలిసినప్పుడు కత్తి తీసి పోరాటం చేయడమే సరైనది అంటూ గతంలో ఆయన పోస్ట్ చేశారు. ఇప్పుడు తాజాగా చేసిన పోస్ట్ కచ్చితంగా చంద్రబాబుకు బెయిల్ వస్తుంది అన్న ఆయన ఆశావహ దృక్పధాన్ని వెల్లడించింది. చీకటి తర్వాత వెలుగు రావాల్సిందేనని ఆయన పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications