నాన్ వెజ్ ప్రియులకు షాక్; కొండెక్కి కూర్చున్న చికెన్ ధరలు!!

తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకుతున్నాయి. నాన్ వెజ్ ప్రియులకు షాక్ ఇస్తున్నాయి. కొండెక్కి కూర్చున్న చికెన్ ధరలతో సామాన్యులు నాన్వెజ్ కొనాలంటేనే భయపడుతున్నారు. వారానికి ఒక్క రోజైనా నాన్ వెజ్ తినే మాంసం ప్రియులు తాజా ధరలతో అహ నా పెళ్ళంట సినిమాలో కోటా శ్రీనివాసరావు కోడిని వేలాడగట్టుకుని దానిని చూస్తూ అన్నం తిన్న సీన్ ను గుర్తు చేసుకుంటున్నారు.

ఎండాకాలం కావడంతో చికెన్ ధరలు విపరీతంగా పెరిగాయి. ఎండ వేడి వల్ల కోళ్లు మృత్యువాత పడటంతో పాటు, ఎండల దెబ్బకు కోడి పిల్లలు ఎదగడం లేదని పౌల్ట్రీ నిర్వాహకులు చెబుతున్నారు. వాతావరణంలో చోటుచేసుకున్న ఆకస్మిక మార్పులవల్ల కోడి పిల్లలు కూడా 40 నుంచి 60 శాతం మరణాలు సంభవిస్తున్నాయని వారు అంటున్నారు.. దీంతో కోడి మాంసం ఉత్పత్తి గణనీయంగా తగ్గిందని, డిమాండ్ మాత్రం ఎక్కువగా ఉందని చెబుతున్నారు.

 nonveg-

అంతేకాదు కోళ్ళ దాణా ఖర్చులు కూడా బాగా పెరిగాయి. కరోనాకు ముందు కోళ్ళ దాణా ఖర్చులు, ఇప్పుడు కోళ్ళ దాణా ఖర్చులు విపరీతంగా పెరిగాయి. కరోనా కు ముందు కిలో సోయా ముప్పై ఐదు రూపాయలకు లభించగా, ప్రస్తుతం కిలో సోయా 105 రూపాయలకు చేరుకుంది. 13 రూపాయలకు కిలో లభించే మొక్కజొన్న దాణా 40 రూపాయలకు చేరుకుంది

ఈ కారణంగానే కోడి ధరలు కొండెక్కి కూర్చున్నాయి. చికెన్ ధరలు తెలుగు రాష్ట్రాలలో సామాన్యులు కొనలేనంతగా పెరిగాయి.అసలే నిత్యావసర వస్తువుల ధరలు, వంటనూనెల ధరలు విపరీతంగా పెరిగి సరకులు కొనాలంటే తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న సామాన్య మధ్యతరగతి ప్రజలు, పెరిగిపోయిన చికెన్ ధరలతో మరింత ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు.

ప్రస్తుతం కిలో చికెన్ ధర మూడు వందల రూపాయలకు చేరుకుంది. తెలుగు రాష్ట్రాలలో స్కిన్ లెస్ చికెన్ కిలో 300 రూపాయలు, స్కిన్ తో చికెన్ కిలో 280 రూపాయలు, ఇక కోడి ధర 180 రూపాయలుగా ప్రస్తుతం విక్రయిస్తున్నారు. కోడిగ్రుడ్ల ధర ఒక్కొక్క గ్రుడ్డుకు 5 రూపాయలుగా ఉంది. దీంతో ముందు ముందు కోళ్ళను చూసి తిన్నట్టు ఫీల్ కావాల్సి వస్తుందేమో అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+