వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవన్ కోటరీపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన పీవీఆర్ .. పార్టీకి రాజీనామా ...కారణం ఇదే

|
Google Oneindia TeluguNews

ఒకపక్క పవన్ కళ్యాణ్ పార్టీని బలోపేతం చెయ్యాలని , స్థానిక సంస్థల ఎన్నికల్లో అయినా జనసేన సత్తా చూపించాలని ప్రయత్నం చేస్తుంది. ఇక దీని కోసం కసరత్తు ప్రారంభించిన పవన్ కళ్యాణ్ నియోజకవర్గాల వారీగా పార్టీని బలోపేతం చెయ్యటంపై దృష్టి సారించారు. ఇక ఇదే పవన్ కు షాక్ ఇచ్చింది. పశ్చిమగోదావరి జిల్లాలో జనసేన పార్టీకి గట్టి షాక్ తగిలింది. గత ఎన్నికల్లో తణుకు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన పసుపులేటి రామారావు తనకు కాకుండా వేరొకరికి నియోజకవర్గ ఇంచార్జ్ ఇవ్వటంతో రాజీనామా చేశారు. పార్టీలో తనకు సముచిత స్థానం కల్పించడం లేదంటూ ఆయన రాజీనామా చేశారు. అంతే కాకుండా పార్టీపైన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

తణుకు నియోజకవర్గ ఇంచార్జ్ వేరేవారికి ఇచ్చారని పీవీఆర్ రాజీనామా .. పవన్ చుట్టూ కోటరీ అంటూ తీవ్ర వ్యాఖ్యలు

తణుకు నియోజకవర్గ ఇంచార్జ్ వేరేవారికి ఇచ్చారని పీవీఆర్ రాజీనామా .. పవన్ చుట్టూ కోటరీ అంటూ తీవ్ర వ్యాఖ్యలు


జనసేన పార్టీకి తణుకు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి రామారావు రాజీనామా చేశారు . ఇక రాజీనామా చేసిన అనంతరం పసుపులేటి రామారావు పార్టీపై తీవ్ర ఆరోపణలు చేశారు.ముఖ్యంగా పవన్ కోటరీ ఉన్నంత కాలం జనసేన పార్టీ పైకి రాదనీ ఆయన ఆరోపించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చుట్టూ ఒక కోటరీ చేరిందని ఆ కోటరీ డబ్బే పరమావధిగా పనిచేస్తుందని ఆయన ఆరోపించారు. తణుకు నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి తాను ఎంతో కృషి చేసినట్లు తెలిపారు. నర్సాపురం పార్లమెంటరీ మీటింగ్ లో తనను తప్పించి వేరొకరిని ఇంచార్జ్ గా నియమించడం సరికాదని రామారావు అభిప్రాయపడ్డారు.

 జనసేన రెబల్ గా పోటీ చేసిన వారికి పార్టీలో బాధ్యతలు .. కోటరీ మహిమ అన్న పీవీఆర్

జనసేన రెబల్ గా పోటీ చేసిన వారికి పార్టీలో బాధ్యతలు .. కోటరీ మహిమ అన్న పీవీఆర్

పసుపులేటి రామారావు పీవీఆర్ ఫౌండేషన్ తరపున వివిధ సామాజిక సేవాకార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండేవారు. అనంతరం జనసేన పార్టీలో చేరి తణుకు నుంచి పోటీ చేశారు. తణుకు నియోజకవర్గం అభ్యర్థిగా పోటీ చేసి 32 వేల ఓట్లు సాధించారు. అంతేకాదు తణుకు నియోజకవర్గంలో జనసేన పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేశారు పసుపులేటి రామారావు. జనసేన పార్టీ కోసం తాను ఎంతో కష్టపడ్డానని కానీ గత ఎన్నికల్లో జనసేన పార్టీ రెబెల్ అభ్యర్థిగా పోటీ చేసిన రామచంద్రరావు అనే వ్యక్తిని తణుకు ఇంచార్జ్ గా నియమించడం తనను తీవ్ర అసంతృప్తికి గురి చేసిందని ఆయన పేర్కొన్నారు . పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారిని ఇంచార్జ్ గా నియమించడంపై మండిపడిన రామారావు గత ఎన్నికల్లో తనకు వ్యతిరేకంగా, జనసేన రెబెల్ అభ్యర్థిగా రామచంద్రరావు పని చేస్తే ఇప్పుడు ఆయనకు పిలిచి పెద్ద పీట వేశారని పేర్కొన్నారు . ఈ విషయాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి అప్పుడే తీసుకెళ్దామని ప్రయత్నించానని అయితే కొందరు అడ్డుకున్నారని ఆరోపించారు. ఇక వారే ఇప్పుడు జనసేనకు చేటు చేస్తున్నారని ఆరోపించారు.

అప్పుడు ముద్దులు పెట్టావ్ .. ఇప్పుడు వాతలు పెడుతున్నావ్ .. జగన్ పై డొక్కా ఫైర్అప్పుడు ముద్దులు పెట్టావ్ .. ఇప్పుడు వాతలు పెడుతున్నావ్ .. జగన్ పై డొక్కా ఫైర్

 కోటరీ వల్ల జనసేన స్థానిక సంస్థల ఎన్నికల్లో వార్డ్ మెంబర్ గా కూడా గెలవటం కష్టం అన్న పీవీఆర్

కోటరీ వల్ల జనసేన స్థానిక సంస్థల ఎన్నికల్లో వార్డ్ మెంబర్ గా కూడా గెలవటం కష్టం అన్న పీవీఆర్


అంతే కాదు పవన్ చుట్టూ ఉన్న కోటరీ చాలా విషయాలు పవన్ దాకా పోనివ్వటం లేదని ఆయన ఆన్నారు . రెండు నెలలుగా పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరుతుంటే ఆయన చుట్టూ ఉన్న కోటరీ కలవకుండా అడ్డుకుంటుందని ఆరోపించారు. ఈ కోటరీ ఇలానే ఉంటే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కనీసం ఒక వార్డు మెంబర్ ను కూడా గెలిచే సీన్ లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికైనా పవన్ పార్టీలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఆయన పేర్కొన్నారు . పవన్ చుట్టూ ఉన్న కోటరీ వల్లే పార్టీ వీడిపోతున్నానని చెప్పారు.

English summary
Jana Sena Party leader in West Godavari district shocked pawan with his resignation . Pasupuleti Rama Rao, who contested as Tanuku constituency MLA candidate in the last election, resigned after giving a constituency incharge to someone other than himself. He resigned, saying he was not given a proper respect in the party. He also said that the quotary around Pawan is doing harm to the party . He has been seeking an appointment from pawan from two months, alleging that he was prevented from meeting by the quotary . He added that Pawan needs to know what is going on in the party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X