విశాఖ భూముల అమ్మకంపై హైకోర్టు స్టే,టెండర్లపై కీలక ఆదేశాలు..జగన్ సర్కార్ కు షాక్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏపీ హైకోర్టు షాక్ ఇచ్చింది. ప్రభుత్వ భూముల అమ్మకాలపై జగన్ సర్కార్ స్పీడ్ కు హైకోర్టు బ్రేకు వేసింది. విశాఖ లో ప్రభుత్వ భూముల అమ్మకంపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖ భూముల అమ్మకానికి సంబంధించిన టెండర్లను ఖరారు చేయొద్దని హైకోర్టు స్టే ఇచ్చింది.

విశాఖ ప్రభుత్వ భూముల విక్రయాలపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
ఆంధ్ర ప్రదేశ్ ఎగ్జిక్యూటివ్ రాజధాని విశాఖపట్నంలో ఐదు చోట్ల ఉన్న ప్రభుత్వ భూముల అమ్మకానికి ఏపీ ప్రభుత్వం ఇటీవల నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే . విశాఖ మహా నగరంలోని ఐదు ప్రాంతాల్లో ఉన్న భూములను అమ్మడం ద్వారా 1500 కోట్ల రూపాయలను సమీకరించాలని జగన్ సర్కార్ భావించింది. అయితే ఈ ఉత్తర్వులపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ , జగన్ సర్కార్ ఆదేశాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ ను విచారించిన హైకోర్టు భూముల అమ్మకాలపై స్టే విధించింది.

విశాఖ భూముల అమ్మకాల ప్రక్రియకు సంబంధించి టెండర్లు ఫైనలైజ్ చెయ్యొద్దన్న కోర్టు
గతంలో బిల్డ్ ఏపీ పేరుతో ఇలానే భూముల అమ్మకానికి ప్రయత్నించగా అప్పుడు కూడా కోర్టు స్టే ఇచ్చింది అని పిటిషనర్ ధర్మాసనం దృష్టికి తీసుకువెళ్లారు. పిటిషనర్ వాదనతో ఏకీభవించిన హైకోర్టు ధర్మాసనం గతంలో ఇచ్చిన ఆదేశాలు ప్రస్తుతం ఈ కేసులో కూడా వర్తిస్తాయని , విశాఖ భూముల అమ్మకాల ప్రక్రియకు సంబంధించి టెండర్లు ఫైనలైజ్ చేయకుండా మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. టెండర్ల ఖరారు పై కోర్టు తీర్పు పై కోర్టు తీర్పుకు లోబడి నిర్ణయం తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.

విశాఖలో ఖరీదైన ప్రభుత్వ స్థలాలను అమ్మి డబ్బు సమీకరించాలని భావిస్తున్న జగన్ సర్కార్
ఇదిలా ఉంటే మిషన్ బిల్డ్ ఏపీ పేరుతో విశాఖ లో ఉన్న ఖరీదైన స్థలాలను జగన్ సర్కార్ అమ్మకానికి పెట్టింది. ప్రభుత్వం తరఫున ఈ ప్రక్రియలో భాగంగా నేషనల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ మొత్తం 18 స్థలాలకు వేలం ప్రకటన విడుదల చేసింది. ఇందులో ఏపీఐఐసీకి చెందిన 11.59 ఎకరాల అత్యంత విలువైన భూమికి 1452 కోట్ల రూపాయలను ఆఫ్ సెట్ ధరగా నిర్ణయించింది . ఇక బీచ్ రోడ్ లోని స్థలం తో పాటుగా విశాఖపట్నం లోని ఇతర 17 ఆస్తులను కూడా ప్రభుత్వం వేలానికి పెట్టిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications