పిన్నెల్లి బ్రదర్స్ కు బిగ్ షాక్..! సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..!

పల్నాడులో వైసీపీ కీలక నేతలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పిన్నెల్లి వెంకట్రామిరెడ్డికి ఇవాళ సుప్రీంకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. గతంలో జరిగిన పల్నాడు జంట హత్యల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వీరికి మధ్యలో కాస్త ఊరట దక్కింది. అయితే కూటమి సర్కార్ దీనిప సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీంతో విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఇవాళ కీలక నిర్ణయం ప్రకటించింది.

పల్నాడు జంట హత్యల కేసులో పిన్నెల్లి సోదరులకు గతంలో ఇచ్చిన మధ్యంతర బెయిల్‌ రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఇవాళ కీలక ఆదేశాలు ఇచ్చిది. ఈ మేరకు పిన్నెల్లి సోదరులు దాఖలు చేసిన రెండు పిటిషన్లు సుప్రీంకోర్టు కొట్టేసింది. పల్నాడు జంట హత్యల కేసులో పిన్నెల్లి సోదరులకు ముందస్తు బెయిల్‌కు అర్హత లేదని సుప్రీంకోర్టు జస్టిస్‌ సందీప్‌ మెహతా ధర్మాసనం తేల్చేసింది. ఈ మేరకు గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల్ని రద్దు చేస్తూ జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌, జస్టిస్‌ సందీప్‌ మెహతా ధర్మాసనం తీర్పు వెల్లడించింది.

Shock to YSRCP SC Cancels Anticipatory Bail of Pinnelli Brothers in Palandu Dual Murder Case

గతంలో సుప్రీంకోర్టు ఇదే కేసులో ముందస్తు బెయిల్ ఇచ్చిన తర్వాత విచారణకు సహకరించాలని షరతు పెట్టింది. అయితే సుప్రీంకోర్టు చెప్పినా పిన్నెల్లి సోదరులు విచారణకు సహకరించడం లేదని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. అలాగే సాక్షులను బెదిరించారని, సాక్ష్యాలు ట్యాంపర్‌ చేసే ప్రయత్నం చేశారని ఆరోపించింది. దీంతో వీరి ముందస్తు బెయిల్ రద్దు చేస్తూ వెంటనే అరెస్టు చేసేందుకు సైతం అనుమతి ఇచ్చింది.

Shock to YSRCP SC Cancels Anticipatory Bail of Pinnelli Brothers in Palandu Dual Murder Case

వీరిని వెంటనే అరెస్టు చేసేందుకు ఎలాంటి అనుమతులు అవసరం లేదని సుప్రింకోర్టు ధర్మాసనం తెలిపింది. ఈ మేరకు లొంగిపోవడానికి 2 వారాలు సమయమివ్వాలన్న పిన్నెల్లి సోదరుల తరఫు న్యాయవాదుల అభ్యర్ధనను తోసిపుచ్చింది. ముందస్తు బెయిల్‌ విషయంలో సమయం ఎలా ఇస్తారని జస్టిస్‌ సందీప్‌ మెహతా ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో కస్టోడియల్‌ దర్యాప్తు తప్పనిసరని ధర్మాసనం తెలిపింది. సెక్షన్‌ 161 కింద నమోదు చేసిన డాక్యుమెంట్లు నిందితులకు ఎలా అందాయని ప్రభుత్వాన్ని జస్టిస్‌ సందీప్‌ మెహతా ప్రశ్నించారు.

పల్నాడు జిల్లా గుండ్లపాడులో ఇద్దరు టీడీపీ కార్యకర్తల హత్య కేసులో పిన్నెల్లి సోదరులపై ఈ ఏడాది మే 25న కేసు నమోదు చేసారు. ఈ కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఏ6, పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిని ఏ7గా చేర్చారు. అయితే ఈ కేసులో తమకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టు వరకూ వెళ్లి వీరు ఊరట తెచ్చుకున్నారు. అయితే ముందస్తు బెయిల్ షరతుల్ని ఉల్లంఘిస్తున్నారన్న కారణంగా ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించడంతో ఇవాళ అది కాస్తా రద్దయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+