ఇంకా జగనేనా సీఎం? సొంత గడ్డపై జనం షాకులు..!
ఏపీలో గత ఐదేళ్లుగా వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. అప్పట్లో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో చేసిన పనులకు చెల్లించాల్సిన బిల్లులు చెల్లించకుండా అలాగే వదిలేశారు. దీనిపై కాంట్రాక్టర్లు కోర్టులకు వెళ్లినా ఫలితం లేని పరిస్దితి. చివరకు పలుమార్లు కోర్టు మొట్టికాయలు వేయడంతో చివరికి కొన్ని బిల్లులు చెల్లించి చేతులు దులుపుకున్నారు. అయితే అదే వైసీపీ ప్రభుత్వంలో పనులు చేసిన వారికి ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో షాకులు తప్పడం లేదు.
గత వైసీపీ ప్రభుత్వంలో వివిధ కాంట్రాక్టులు చేసిన వారికి బిల్లుల చెల్లింపు జరగలేదు. దీంతో వారు కూటమి ప్రభుత్వం చుట్టూ బిల్లులు క్లియర్ చేయాలని తిరుగుతున్నారు. ఇదే క్రమంలో కొందరు బిల్లుల క్లియరెన్స్ కోసం పార్టీలు కూడా మారిపోతున్నారు. వైసీపీని వీడి అధికార పార్టీలో చేరుతున్నారు. అలా చేరకుండా ఇంకా ఎదురుచూస్తున్న వారిలో కొందరు నిన్న మాజీ సీఎం వైఎస్ జగన్ కు పులివెందులలో షాకిచ్చారు.

గత వైసీపీ ప్రభుత్వంలో తాము చేసిన పనులకు చెల్లించాల్సిన బిల్లులు ఇంకా క్లియర్ కాలేదని జగన్ కు పులివెందుల టూర్ లో వారు ఫిర్యాదు చేశారు. బిల్లులు క్లియర్ చేయించాలని కోరారు. అయితే ఆయన సీఎంగా లేరని తెలిసీ అడుగుతున్నారా లేక తెలియక అడుగుతున్నారా జగన్ కు అర్దం కాలేదు. దీంతో ఆయన ఇంకా బిల్లులేంటని వారిని కసురుకుని పంపేశారు. దీంతో వారూ చేసేది లేక వెనుదిరిగారు.
వైసీపీ హయాంలో చేపట్టిన బిల్లుల క్లియరెన్స్ కాకపోవడంతో ఇప్పటికే పలువురు అప్పటి కాంట్రాక్టర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కూటమి ప్రభుత్వం రోడ్లపై గుంతలు పూడ్చేందుకు పిలిచినా రావడం లేదు. అలాంటి వారిలో కొందరు కూటమి చుట్టూ తిరుగుతుంటే మరికొందరు వైసీపీ నేతల చుట్టూ తిరుగుతున్నారు.












Click it and Unblock the Notifications