పార్లమెంట్ లో షాకింగ్ దాడి: స్పందించిన వైసీపీ ఎంపీ మార్గాని భరత్!!

లోక్ సభ సందర్శకుల గ్యాలరీ నుంచి ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు నిన్న మధ్యాహ్నం సభలో దూకి, భద్రతా ఉల్లంఘనకు పాల్పడ్డారు. వీరితో పాటు పార్లమెంట్ వెలుపల నిరసన తెలుపుతున్న మరో ఇద్దరిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనపై ఉన్నతస్థాయిలో దర్యాప్తు జరుగుతోందని స్పీకర్ ఓం బిర్లా చెప్పారు.

లోక్ సభ భద్రత వైఫల్య ఘటన రాజ్యసభలో కూడా ప్రస్తావనకు వచ్చింది. పార్లమెంట్ భద్రతా విభాగం ఈ అంశాన్ని పరిశీలిస్తుందని రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్కర్ తెలిపారు.ఈ ఘటన నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు పార్లమెంటు వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.

Shocking attack in Parliament: YSRCP MP Margani Bharat responded!!

ఇదిలా ఉంటే పార్లమెంట్ లోకి ఆగంతకులు చొచ్చుకు రావటం, వారు దాడికి యత్నించటంతో ఈ ఘటనపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్ రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ స్పందించారు. ఈ సమాచారం వినగానే తాను తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని ఆయన పేర్కొన్నారు.

పార్లమెంటు సమావేశాలలో కి ప్రవేశించాలంటే సామాన్యమైన విషయం కాదని, ఎంపీలకే మూడు అంచెల తనిఖీ ఉంటుందని, అటువంటిది ముగ్గురు అగంతకులు ఎలా లోపలికి వెళ్లారు అనేది ఆశ్చర్యంగా ఉందని ఎంపీ మార్గాని భరత్ పేర్కొన్నారు. అగంతకులు లోపలికి ప్రవేశించిన సమయంలో తాను అక్కడ లేనని ఆయన తెలిపారు.

దీనిపై సమగ్ర దర్యాప్తు చేపట్టి నిజానిజాల నిగ్గు తేల్చాలని మార్గాని భరత్ తెలిపారు. దాదాపు 22 సంవత్సరాల క్రితం పార్లమెంట్లో ఒక ఘటన జరిగినట్టు తాను విన్నానని పేర్కొన్న ఆయన, తాజాగా జరిగిన సంఘటన ఏకంగా లోక్ సభ లోపల ఎలా జరిగిందో అర్థం కావడం లేదన్నారు. షూస్ లో టియర్ గ్యాస్ పెట్టుకుని వెళ్లి లోకల్ టీవీలలో వస్తున్న సమాచారాన్ని బట్టి తనకు తెలిసిందని తెలిపారు.

విజిటర్స్ గ్యాలరీ నుంచి సభలోకి దూకారంటే ఇది పూర్తిగా భద్రత వైఫల్యం అని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. అసలు వీరు ఎక్కడి నుంచి వచ్చారు? వీరి వెనక ఎవరున్నారు? మీరు ఏం చేయాలనుకుంటున్నారు? తదితర విషయాలపై సమగ్ర దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందన్న ఎంపీ మార్గాని భరత్ దర్యాప్తు చేసి అసలు విషయం తేల్చాలన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+