అమెరికాలో పరువు తీశారు!: చంద్రబాబుపై ఫిర్యాదు, జగన్ పార్టీ నిర్వాకమా?

ఏపీలో పెట్టుబడుల కోసం అమెరికాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబును ఇబ్బంది పెట్టేందుకు, వైసిపి మద్దతుదార్లుగా భావిస్తున్న కొందరు ప్రయత్నాలు చేశారని టిడిపి ఆరోపిస్తోంది.

హైదరాబాద్: ఏపీలో పెట్టుబడుల కోసం అమెరికాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబును ఇబ్బంది పెట్టేందుకు, వైసిపి మద్దతుదార్లుగా భావిస్తున్న కొందరు ప్రయత్నాలు చేశారని టిడిపి ఆరోపిస్తోంది.

చంద్రబాబుపై మేయర్‌కు, పోలీసులకు ఫిర్యాదు చేశారు. చివరకు వారి వ్యవహారం వారికే రివర్స్ అయిందని, చంద్రబాబుకు భద్రత కల్పించేందుకు కారణమైందని చెబుతున్నారు.

అసలేం జరిగిందంటే..?

అసలేం జరిగిందంటే..?

అమెరికా పర్యటనలో భాగంగా చంద్రబాబు డాలస్‌లోని ఇర్వింగ్‌ పట్టణానికి వెళ్లారు. ఆ సమయంలో ఇర్వింగ్‌ మేయర్‌ బేతవాన్‌ డ్యూన్‌కు కొంతమంది ఈ-మెయిల్స్‌ పంపించారు.

ఎర్రచందనం స్మగ్లర్ల పేరుతో చంద్రబాబు ఏపీలో 25 మందిని చంపించారని, ఆయన ఇప్పుడు ముందస్తు అనుమతి లేకుండా అమెరికాలో పర్యటిస్తున్నారని, అక్రమంగా భారీ ఎత్తున నిధులు సేకరిస్తున్నారని, దీనిపై విచారణ జరిపించాలని ఇండియన్స్‌ ఫైటింగ్‌ ఫర్‌ హ్యూమన్‌ రైట్స్‌ పేరిట ఈ ఈ-మెయిల్స్ పంపించారు.

అప్రమత్తమైన మేయర్ బేతవాన్

అప్రమత్తమైన మేయర్ బేతవాన్

వీటిని చూడగానే ఇర్వింగ్‌ మేయర్‌ బేతవాన్ అప్రమత్తమయ్యారు. సమాచారాన్ని పోలీసులకు అందించారు. ఇర్వింగ్‌ పోలీసులు హుటాహుటిన చంద్రబాబు ప్రవాసాంధ్రులతో సమావేశమైన చోటుకు వెళ్లారు.

అక్కడకు వెళ్లాక చూస్తే.. పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. భారీ సంఖ్యలో హాజరైన ప్రవాసాంధ్రులు, ప్రముఖులతో అంతా కోలాహలంగా ఉంది. ఈ కార్యక్రమంలో ప్రవాసులు చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు.

ఉన్నతస్థాయి రాజకీయ ప్రతినిధులకు చెందిన సమావేశమని పోలీసులు గుర్తించారు. చంద్రబాబు ఏపీ సీఎం అని, పెట్టుబడులు ఆహ్వానించేందుకు ప్రవాసాంధ్ర ప్రముఖులతోపాటు, అమెరికాకు చెందిన పలు కంపెనీల ప్రతినిధులతో అధికారికంగా సమావేశమవుతున్నారని తెలుసుకున్నారు. తమకు వచ్చిన మెయిల్స్‌లో వాస్తవం లేదని గుర్తించారు.

చంద్రబాబుకు భద్రత

చంద్రబాబుకు భద్రత

చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలనే ఫిర్యాదుపై రంగంలోకి దిగిన ఇర్వింగ్‌ పోలీసులు.. ఆ తర్వాత ఆయన కార్యక్రమానికే భద్రత కల్పించారు. దీంతో కార్యక్రమ నిర్వాహకులు కూడా ఆశ్చర్యపోయారు. విదేశాల నుంచి వచ్చిన నాయకులకు అక్కడి పోలీసులు భద్రత కల్పించరు.

కార్యక్రమ నిర్వహకులు కూడా భద్రత కల్పించాలని కోరలేదు. దీంతో, భద్రత ఎందుకు కల్పించారంటూ వారు నేరుగా పోలీసులనే అడిగారు. దీంతో వారు తమకు అందిన ఈ-మెయిల్‌ వివరాలు తెలిపారు. తప్పుడు ఈ-మెయిల్స్‌ పంపిన వ్యక్తుల నుంచి భద్రతాపరమైన సమస్యలు ఏర్పడవచ్చునన్న అనుమానంతో.. భద్రత కల్పించినట్లు చెప్పారు.

వైసిపి మద్దతుదారుల కుట్ర అని టిడిపి ఆరోపణ

వైసిపి మద్దతుదారుల కుట్ర అని టిడిపి ఆరోపణ


ఈ పని చేసింది వైసిపి మద్దతుదారులేనని టిడిపి ఆరోపిస్తోంది. వైసిపి మద్దతుదారులు చేశారనే వార్తల నేపథ్యంలో అందరూ విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పెట్టుబడుల సమీకరణకు వెళ్లిన ముఖ్యమంత్రిపై ఇలా ఫిర్యాదులు చేయడం దేనికి సంకేతమని ప్రశ్నిస్తున్నారు.

పార్టీలు, విధానాలు ఎలా ఉన్నా, దేశం కాని దేశంలో ఇలా రాష్ట్రం పరువు తీసే చర్యలు ఎంతమాత్రం సరికావని అంటున్నారు. పొరుగున ఉన్న తమిళనాడు, కర్ణాటక నాయకులు పార్టీలకు అతీతంగా ఏకమై రాష్ట్రాభివృద్ధి కోసం పోరాడుతుంటే, ఏపీ పార్టీలు ఇలా కొట్లాడుకోవడం ఏమిటంటున్నారు.

తెలిసి చేసినా.. తెలియక చేసినా

తెలిసి చేసినా.. తెలియక చేసినా

పార్టీ నాయకత్వానికి తెలిసి జరిగినా, తెలియక జరిగినా తప్పు చేసినట్లే అని అంటున్నారు. వైసిపి చేస్తున్న వరుస తప్పుల్లో ఇది ఒకటి అవుతుందని టిడిపి నేతలు అంటున్నారు.

రాష్ట్ర ప్రతిష్టను, అభివృద్ధిని దెబ్బతీసేలా జగన్ మీడియా బృందం కుట్రలు, కుతంత్రాలు సాగిస్తోందని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. ఎన్నికల వరకు రాజకీయాలు మామూలేనని, కానీ అభివృద్ధి కోసం చేస్తున్న పర్యటనపై తప్పుడు ప్రచారం దుర్మార్గమన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+