బీఫార్మసీ విద్యార్థిని మృతికేసులో షాకింగ్ ట్విస్ట్: ఆత్మహత్య రేప్ ఎలాఅయ్యింది జగన్? లోకేష్ ప్రశ్న!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల కాలంలో వరుసగా చోటు చేసుకున్న అత్యాచారాలు ఏపీ ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా తయారయ్యాయి. తాజాగా శ్రీ సత్య సాయి జిల్లా గోరంట్ల కు చెందిన బీఫార్మసీ విద్యార్థి తేజస్విని ఆత్మహత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసును అత్యాచార కేసు గా మారుతున్నట్లు ఎస్పీరాహుల్ దేవ్ వెల్లడించారు. అంతేకాదు ఈ కేసును దిశా పోలీసులకు బదిలీ చేసినట్టు కూడా ఆయన పేర్కొన్నారు.

బీఫార్మసీ విద్యార్థిని తేజస్విని కేసులో కీలక పరిణామం

బీఫార్మసీ విద్యార్థిని తేజస్విని కేసులో కీలక పరిణామం

సత్యసాయి జిల్లా లో బీఫార్మసీ చదువుతున్న విద్యార్థిని తేజస్విని ఈనెల 4వ తేదీన గోరంట్ల మండలం మల్లేపల్లి సమీపంలోని ప్రియుడు సాదిక్ కి సంబంధించిన ఓ షెడ్ లో ఉరి వేసుకుని కనిపించడంతో పోలీసులు ఆత్మహత్య కేసు నమోదు చేశారు. అయితే మృతురాలి తల్లిదండ్రులు సామూహిక అత్యాచారం, హత్య అని అనుమానం వ్యక్తం చేయడంతో అత్యాచారం కింద కేసు నమోదు చేశారు.

పోస్ట్ మార్టం నివేదిక ఆధారంగా ఆత్యాచారం కేసు నమోదు

పోస్ట్ మార్టం నివేదిక ఆధారంగా ఆత్యాచారం కేసు నమోదు

నిందితుడు సాధిక్ ను అరెస్ట్ చేసిన ధర్మవరం పోలీసులు నిందితుడిని మీడియా ముందు ప్రవేశ పెట్టారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఆపై నిందితుడిని కోర్టులో హాజరు పరచగా కోర్టు నిందితుడికి 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ కేసు వివరాలను తెలిపిన డీఎస్పీ రమాకాంత్ తేజస్విని మృతదేహానికి పెనుగొండ ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించామని, ఆ నివేదిక ఆధారంగా నిందితుడిపై అదనంగా 376 అత్యాచారం సెక్షన్ ను కూడా నమోదు చేశామని పేర్కొన్నారు.

కేసు దిశా డీఎస్పీకి బదిలీ ... రెండు వారాలలోనే చార్జ్ షీట్

కేసు దిశా డీఎస్పీకి బదిలీ ... రెండు వారాలలోనే చార్జ్ షీట్

ప్రేమ పేరుతో తేజస్వినిని మోసగించి శారీరకంగా వాడుకున్న సాధిక్ పై 420 సెక్షన్ తో పాటుగా ఆత్మహత్యకు ప్రేరేపించినందుకు 306 సెక్షన్ కింద కేసు నమోదు చేశామని వెల్లడించారు. నిందితుడిని కొత్త చెరువు సమీపంలో గోరంట్ల సీఐ జయ నాయక్ అరెస్టు చేశారని తెలిపారు. నిందితుడి వద్దనుండి బైక్, మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకొని సీజ్ చేసినట్లుగా డీఎస్పీ వెల్లడించారు. ప్రస్తుతం కేసును అనంతపురం దిశా డిఎస్పీ శ్రీనివాసులు పర్యవేక్షిస్తారని డిఎస్పి రమాకాంత్ వెల్లడించారు. ఇక ఈ కేసు పై విచారణ చేస్తున్న దిశ డిఎస్పీ శ్రీనివాసులు రెండు వారాల్లో విచారణను ముగించి చార్జిషీట్ దాఖలు చేస్తామని పేర్కొన్నారు. నిందితుడికి శిక్ష పడే విధంగా చూస్తామని వెల్లడించారు.

ఆత్మహత్య కేసు రేప్ కేసుగా ఎలా మారిందన్న లోకేష్

ఆత్మహత్య కేసు రేప్ కేసుగా ఎలా మారిందన్న లోకేష్

ఇక తాజాగా బీఫార్మసీ స్టూడెంట్ తేజస్విని అత్యాచారాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించారని, జగన్ సర్కార్ ను టార్గెట్ చేశారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. ముఖ్యమంత్రి గారూ! బి ఫార్మసీ స్టూడెంట్ తేజస్విని హత్యాచారాన్నిఆత్మహత్యగా చిత్రీకరించడం ముమ్మాటికీ మీ వైసీపీ దండుపాళ్యం గ్యాంగ్ ని తప్పించే ఎత్తుగడే అంటూ లోకేష్ విమర్శించారు. తమ బిడ్డని రేప్ చేసి చంపేశారనితల్లిదండ్రులు ఆరోపిస్తే పోస్ట్ మార్టం కాకుండానే ఆత్మహత్యగా డిఎస్పీ తేల్చేసింది మీ కళ్లల్లో ఆనందం కోసమేనని అర్థమవుతోందని లోకేష్ వ్యాఖ్యలు చేశారు. నిన్నటి సూసైడ్ నేటి రేప్ గా ఎలా మారింది జగన్ రెడ్డి గారు! చెప్పాలని లోకేష్ ప్రశ్నించారు. ఇది యాగీ చేయడం కాదు. మీ బిడ్డలకో, మీ నేతల పిల్లలకో ఇదే అన్యాయం జరిగితే ఇలానే స్పందిస్తారా? అంటూ లోకేష్ జగన్ మోహన్ రెడ్డిని నిలదీశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+