ఇంకా సమైక్యమా, ఏం చేయాలో చెప్పండి!: పురంధేశ్వరి

రాష్ట్ర విభజన బిల్లు తయారవుతున్నప్పుడు రాష్ట్ర విభజనకు కేంద్ర ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తున్న ఈ తరుణంలో ఇంకా సమైక్యం అంటూ పట్టుకు వేలాడాలా లేక అలా కాకుండా మన హక్కుల కోసం పోరాడాలా అని అన్నారు. ప్రజలు దానిపై స్పష్టత ఇస్తే తాను నిర్ణయం తీసుకుంటానని చెప్పారు.
విభజన జరుగుతున్న సమయంలో మన హక్కుల కోసం పోరాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. రాష్ట్రాన్ని విభజించాలని కాంగ్రెస్ అధిష్ఠానాన్ని తాము కోరలేదన్నారు. సమైక్యంగా ఉంచేందుకే అంతా ప్రయత్నించామన్నారు. అయితే, అన్ని పార్టీలు విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చిన తర్వాతే కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయం తీసుకుందని చెప్పారు.
తెలుగు జాతి మనది.. నిండుగ వెలుగు జాతి మనది.. సర్కారు మనది, నెల్లూరు మనది.. అంటూ మనమంతా గుండెలు చరుచుకుంటున్న సమయంలో రాష్ట్ర విభజన సమస్య వచ్చింది. దీనికి అందరూ కాంగ్రెస్‌నే తప్పుబడుతున్నారని, కాంగ్రెస్ పార్టీయే విభజనను తెరపైకి తెచ్చిందని అంటున్నారని, రాజకీయ లబ్ధి కోసమే విభజన నిర్ణయం తీసుకుందని చెప్పడం సరికాదన్నారు.
కానీ విభజనలో అన్ని పార్టీల పాత్ర ఉందన్నారు. ఆత్మ గౌరవ యాత్ర, సమైక్య శంఖారావం, బస్సుయాత్ర, పాదయాత్ర రాజకీయ లబ్ధి కోసం కాదా చెప్పాలని, టిడిపి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సహా అన్ని పార్టీలూ విభజనకు అనుకూలంగా లేఖలు ఇచ్చాయన్నారు.
అన్ని పార్టీలు లేఖలు ఇచ్చినా తర్వాతే కేంద్రం నిర్ణయం తీసుకుందని తెలిపారు. కాంగ్రెస్‌కు ప్రత్యేక రాష్ట్రం పైన ఆసక్తి ఏమీ లేదన్నారు. లేఖలు ఇచ్చిన విషయం మర్చిపోయి పార్టీలల నేతలు కాంగ్రెస్‌దే తప్పు అన్నట్టు మాట్లాడుతుండడం విడ్డూరమన్నారు.












Click it and Unblock the Notifications