‘రాజధానిగా హైదరాబాద్‌ను గుర్తించడం మానేయాలి’
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు రాజధానిగా హైదరాబాద్‌ను గుర్తించడం మానివేయాలని ఏపీఎన్జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌బాబు సూచించారు. మంగళవారం పశ్చిమకృష్ణా ఎన్జీవో అసోసియేషన్ ఆధ్వర్యంలో అశోక్‌బాబును ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిలో హడ్కో నిధులతో 15వేల ఇళ్లు నిర్మించుకోవచ్చని అన్నారు. ఇందుకు సంబంధించిన ప్రణాళికను వివరిస్తే.. ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సానుకూలంగా స్పందించారని అశోక్‌బాబు తెలిపారు.

ఏపీలో వైద్య కళాశాలలు ఏర్పాటు చేయండి: కామినేని
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా వైద్య కళాశాలలు, యూనివర్సిటీల ఏర్పాటుపై కేంద్ర మంత్రులు జెపి నడ్డా, శ్రీపాదనాయక్‌లతో రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ చర్చించారు. మంగళవారం ఆయన ఢిల్లీలో కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు.
పశ్చిమగోదావరి, విజయనగరం జిల్లాల్లో, మచిలీపట్నం, చిత్తూరుల్లో ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏర్పాటు చేయాలని కేంద్రమంత్రి జెపి నడ్డాకు విజ్ఞప్తి చేశారు. ఎయిమ్స్ పనులు వేగవంతం చేయాలని కోరారు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఛాంబర్‌లో ఆయుష్ మంత్రి శ్రీపాద యశోనాయక్‌తోనూ కామినేని భేటీ అయ్యారు.












Click it and Unblock the Notifications