Shruti Haasan: ముంబై ఎయిర్ పోర్ట్ లో శృతి హాసన్ అసహనం.. రీజన్ ఇదే!!

టాలీవుడ్ లో శృతి హాసన్ దూసుకుపోతుంది. వరుస చిత్రాలతో బిజీగా ఉన్న శృతిహాసన్ తనదైన నటనతో అందరినీ ఆకట్టుకుంటుంది . సినిమాలలో తాను నటనలో ది బెస్ట్ అనిపించుకునేలా యాక్టింగ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం తెలుగులో టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న శృతిహాసన్ ఇటీవల దుబాయ్ లో నిర్వహించిన సైమా అవార్డ్స్ ఫంక్షన్ కు వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో విమానాశ్రయంలో ఓ వ్యక్తి తీరుతో అసహనానికి గురైంది.

ఈరోజు ఉదయం శృతిహాసన్ దుబాయ్ నుండి ముంబై ఎయిర్పోర్ట్ కు చేరుకున్న క్రమంలో ఎయిర్పోర్ట్ నుండి బయటకు వస్తున్న సమయంలో శృతిహాసన్ ను ఓ గుర్తు తెలియని వ్యక్తి వెంబడించాడు. శృతిహాసన్ తో కలిసి ఆమెతో పాటే వెళ్లే ప్రయత్నం చేశాడు. అయితే శృతిహాసన్ హాసన్ ఫోటోలు తీస్తున్న కెమెరా మెన్స్ అతని ఎవరు అని ప్రశ్నించడంతో తీవ్ర అసహనానికి గురయ్యారు.

Shruti Haasan impatience

అతను ఎవరో తనకు తెలియదని చిరాకు పడిన శృతిహాసన్. ఎయిర్పోర్ట్ నుంచి బయటకు కారు వద్దకు వెళ్లే ప్రయత్నం చేస్తున్న క్రమంలో మళ్లీ సదరు అగంతకుడు శృతిహాసన్ దగ్గరకు వెళ్ళాడు. దీంతో చిరాకు పడిన ఆమె తీవ్ర అసహనంతో మీరెవరో నాకు తెలియదు సార్ అని సీరియస్ అయింది.

ఆపై వెంటనే తన కారులో అక్కడి నుండి వెళ్ళిపోయింది. బ్లాక్ కలర్ షర్ట్, బ్లూ కలర్ జీన్స్ వేసుకున్న వ్యక్తి ఎవరనేది పక్కన పెడితే శృతిహాసన్ తీవ్ర ఇబ్బందిని ఎదుర్కొన్నారు. ఓ సమయంలో ఆమె భయబ్రాంతులకు కూడా గురయ్యారు. అయితే సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతుండగా నెటిజన్లు శృతిహాసన్ కి మద్దతుగా స్పందిస్తున్నారు.

ఎక్కడైనా అభిమానులు తమ అభిమాన హీరోయిన్లు, హీరోలు కనిపిస్తే మాట్లాడడానికి, సెల్ఫీలు తీసుకోవడానికి ట్రై చేస్తారు కానీ ఇలా వెంబడించడం కరెక్ట్ కాదని పలువురు కామెంట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే శృతిహాసన్ ప్రభాస్ జంటగా పాన్ ఇండియా మూవీ సలార్ లో నటిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+