మహిళా కానిస్టేబుల్‌కు సీఐ వేధింపు, అసభ్యకర సందేశాలు: సస్పెన్షన్
గుంటూరు: తనను పై అధికారి లైంగికంగా వేధిస్తున్నారని, అసభ్యకర సందేశాలు పంపిస్తున్నారని గుంటూరు జిల్లాలో ఓ మహిళా కానిస్టేబుల్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదును పరిశీలించి.. వాస్తవమేనని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించినట్లు తెలుస్తోంది.
నరసారావుపేట రూరల్ సిఐ శరత్ పైన ఒక మహిళా కానిస్టేబుల్ ఫిర్యాదు చేశారు. ఎస్పీకి ఆమె ఫిర్యాదు ఇచ్చారు. సిఐ వేధించినట్లుగా ప్రాథమికంగా నిర్ధారణ కావడంతో శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
సిఐ సస్పెన్షన్
మహిళా కానిస్టేబుల్‌ను లైంగికంగా వేధించిన శరత్ బాబును సస్పెండ్ చేశారు. సిఐపై పైన ఫిర్యాదును ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీకి పంపించారు. నివేదిక ఆధారంగా చర్యలు తీసుకున్నట్లు గుంటూరు రేంజ్ ఐజీ సంజయ్ చెప్పారు. ఇలాంటి సంఘటనలను ఉపేక్షించేది లేదని చెప్పారు. అదనపు ఎస్పీ శోభా మంజూరి నేతృత్వంలో దీనిపై పూర్తి విచారణకు ఆదేశించారు. బాధిత మహిళా కానిస్టేబుల్ పేరు నాగశ్వేతగా తెలుస్తోంది.

త్వరలోనే కరువు మండలాలను ప్రకటిస్తాం: ప్రత్తిపాటి
రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కరువు మండలాలను త్వరలోనే ప్రకటిస్తామని వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు స్పష్టం చేశారు.
గురువారం చిత్తూరు జిల్లాలోని ముడుపులవేముల, యారంపల్లె, పోతువారిపల్లెలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఎండిపోయిన వేరుశనగ పంటను పరిశీలించి రైతులను పరామర్శించారు. పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు.
జిల్లా కలెక్టర్లతో ఏపీ సీఎస్ వీడియో కాన్ఫరెన్స్
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు జిల్లాల కలెక్టర్లతో గురువారం ఉదయం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో వర్షాభావం, కరవు పరిస్థితులపై చర్చించారు.












Click it and Unblock the Notifications