ఎస్సై నిర్వాకం: యువతిని గర్భవతిని చేసి, మరో పెళ్లికి రెడీ

చిత్తూరు: చిత్తూరు జిల్లాలో ఓ ఎస్సై దుర్మార్గమైన చర్యకు ఒడి గట్టాడు. తన వద్దకు భూమి తగాదాపై ఫిర్యాదు చేయడానికి వచ్చిన యువతిని లోబరుచుకుని పెల్లి చేసుకుంటానని నమ్మించి రెండు సార్లు గర్భవతిని చేశాడు. చివరకు మరో పెళ్లికి సిద్ధమయ్యాడు.

రెండో సారి కూడా గర్భం తీయించుకోమంటూ యువతిని ఆ ఎస్సై కొట్టి బెదిరించాడు. దానికి తోడు మరో వివాహం చేసుకోవడానికి సిద్ధమయ్యాడు. పెళ్లికి అడ్డొస్తే అంతుచూస్తామంటూ అతడి కుటుంబం కూడా భయపెట్టింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు ఆ ఎస్సైపై కేసు నమోదు చేశారు.

తనను మోసం చేసిన ఆ ఎస్‌ఐని కఠినంగా శిక్షించి తనకు న్యాయం చేయాలంటూ ఆ యువతి బుధవారం చిత్తూరు జిల్లాలోని చౌడేపల్లె సీఐ కార్యాలయంలో పలమనేరు డీఎస్పీ శంకర్‌కు విన్నవించుకుంది. చిత్తూరుజిల్లా చౌడేపల్లె మండలం బోయకొండ గంగాపురంలోని ఎం.శ్రీరాములునాయుడు కూతురు ఎం.అరుణ (27) బీఏ, బీఈడీ చదివింది.

SI impregnated a girl and prepared to marry another

వీరి కుటుంబానికి గ్రామంలోని నాగప్ప కుమారుడు జి.సురేశబాబుకు మధ్య భూతగాదా చోటు చేసుకుంది. దీంతో ఆ సమస్య పరిష్కారానికి మూడేళ్ల క్రితం అరుణ తన తల్లి జయలక్ష్మమ్మతో కలిసి పలమనేరులో డీఎస్పీకి ఫిర్యాదు చేయడానికి వెళ్లారు. రామకుప్పం ఎస్‌ఐగా పని చేస్తున్న కె. సునీల్‌కుమార్‌రెడ్డి అరుణతో మాట్లాడి భూతగాదాను తాను పరిష్కరిస్తానంటూ తన సెల్‌ నంబరు ఇచ్చి ఆమె నంబర్‌ తీసుకున్నాడు.పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పడంతో అతడిని గుడ్డిగా నమ్మి తాను గర్భవతిని అయ్యాయని అరుణ తెలిపారు. తొలిసారి గర్భం వచ్చినప్పుడు అది పోవడానికి మాత్రలు తెచ్చి మింగించాడని, రెండోసారి కూడా అలాగే చేయబోతే బిడ్డను చంపడం మంచిదికాదని, పెళ్లి చేసుకుందామంటూ తాను పట్టుబట్టానని వివరించారు.

బలవంతంగా కొట్టి బెదిరించి మాత్రలు మింగించాడని చెప్పారు. ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజున ప్రేమకు చిహ్నం అంటూ తన బంగారు చైను, బ్రాస్‌లెట్‌, ఉంగరం తీసుకెళ్లాడని ఆవేదన వ్యక్తం చేసింది. తన స్వగ్రామమైన తప్పేటఓబాయిపల్లెలో ఇల్లు కడుతున్నామని, డబ్బులు అవసరమని చెప్పడంతో తాను రూ.20 లక్షలు డబ్బు కూడా ఇచ్చానని, దానికి సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయని ఆమె చెప్పారు.

గత నెల 15న తేదీన సునీల్‌కుమార్‌రెడ్డి, అతని తల్లిదండ్రులు రమాదేవి, రామసుబ్బారెడ్డి, బావ ద్వారకానాథరెడ్డి, మరికొందరు తమ ఇంటికి వచ్చి తన తండ్రిని బెదిరించారని తెలిపారు. సునీల్‌కు వేరే అమ్మాయితో రూ.70 లక్షల కట్నంతో వివాహం నిశ్చయమైందని చెప్పారు.

అరుణ ఫిర్యాదు మేరకు సునీల్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పలమనేరు డీఎస్పీ శంకర్‌ తెలిపారు. తనపై విచారణ ఆపాలంటూ సునీల్‌ హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+